»   » విలన్ వేషాలకు సిద్ధమైన మరో యంగ్ హీరో

విలన్ వేషాలకు సిద్ధమైన మరో యంగ్ హీరో

Posted By:
Subscribe to Filmibeat Telugu
 Baladitya Tamil debut
హైదరాబాద్: నటీనటుల కేటగిరీ వైపు నుంచి చూస్తే అందరికంటే ఎక్కువ ప్రాధాన్యత ఉండేది హీరో హీరోయిన్లకే. ఈ రంగం వైపు వచ్చే యువ నటీనటులు మొదట ఆ రెండింటిపైనే గురి పెడతారు. కానీ అవకాశాలు, అదృష్టం కలిసి రాకుంటే తప్పని సరి పరిస్థితుల్లో సైడ్ రోల్స్, విలన్ పాత్రలు చేయడానికి సిద్దమవుతారు.

తెలుగులో నవదీప్‌ లాంటి చాలా మంది హీరోలు ఇలా దిగజారిన వారే. తాజాగా ఆ లిస్టులో మరో యంగ్ హీరో చేరాడు. అతడెవరో కాదు....నటుడు బాలాదిత్య. చైల్డ్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించిన బాలాదిత్య 'చంటిగాడు' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. హీరోగా అరడజను పైగా చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఒక్క సినిమా కూడా అతనికి కలిసి రాలేదు.

కేవలం హీరో పాత్రలను మాత్రమే నమ్ముకుంటే ముందు సాగడం కష్టమని సరైన సమయంలో గ్రహించిన బాలాదిత్య విలన్ వేషాలు వేయడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం అతను తెలుగులో తేజ తర్వాతి సినిమాలో హీరోగా ఎంపికనప్పటికీ....తమిళంలో సెల్వం దర్శకత్వంలో వచ్చే ఓ చిత్రంలో విలన్ పాత్ర చేయడానికి సైన్ చేసాడు. తమిళంలో బాలాదిత్యకు ఇదే తొలి చిత్రం.

చిన్నప్పటి నుంచి తమిళనాడులో పుట్టి పెరగడం వల్ల బాలాదిత్య తమిళం బాగా మాట్లాడుతాడు. తెలుగులో కలిసి రాలేదు కాబట్టి తమిళంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. విలన్ గా ఎంట్రీ ఇచ్చి వీలైతే తమిళంలోనూ హీరోగా ట్రై చేయాలనే ఆలోచనలో ఉన్నాడు.

English summary
Baladitya to debut as villain in Tamil film to be directed by debutante Selvam. He is "playing an uncouth village ruffian" in the yet-to-be titled film set in a village backdrop.
 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu