»   » పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య త్రిపాత్రాభినయం

పరుచూరి మురళి దర్శకత్వంలో బాలయ్య త్రిపాత్రాభినయం

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాయలసీమ కథాంశంతో రూపుదిద్దుకొని గతంలో విడుదలైన 'సమర సింహా రెడ్డి,నరసింహనాయుడు వంటి చిత్రాలలో నటించి తన అద్వితీయ మైన నటనతో ఒక్క రాయలసీమ ప్రేక్షకులనేకాక అశేష ప్రేక్షకులనూ అలరించిన బాలయ్య మళ్ళీ కద్దరు కట్టి రాయలసీమ రాజసం చూపించబోతున్నాడు.

శ్రీ కీర్తీ కంబైన్స్ పతాకంపై నందమూరి బాలకృష్ణ కథానాయకుడుగా లక్ష్మీ రాయ్, సలోనీ కథానాయికలుగా పరుచూరి మురళి దర్శకత్వంలో ఎం ఎల్ పద్మకుమార్ చౌదరి నిర్మాతగా ఓ చిత్రం రూపుదిద్దుకొంటుంది. ప్రస్తుతం ఈ చిత్ర చిత్రీకరణలో భాగంగా హైదరాబాదు శివార్లలో ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య మూడు విభిన్న గెటప్పులతో ప్రేక్షకులకు కనిపించనున్నాడు.మూడు తరాల వారధిగా ఈ చిత్రంలో బాలయ్య కనిపిస్తాడని సమాచారం .ఈ చిత్రం కోసంగా 'అధినాయకుడు, 'మహదేవనాయుడు , అనే పేర్లు పరిశీలిస్తున్నారని తెలిసింది.అయితే అధికారికంగా ఇంతవరకూ ఎటువంటి పేరూ ఖరారు కాలేదు.అలాగే ఈ చిత్రానికి కళ్యాణీ మాలిక్ అందించే సంగీతం జతకలవనుంది.

English summary
As per the latest news, the makers of the film are planning to change the title of the movie. The reason is, Balakrishna is also acting in a movie called Hara Hara Mahadeva which was launched few weeks ago.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu