»   »  గౌతమీపుత్ర శాతకర్ణికి స్పందన అద్భుతం, ఇది తెలుగు జాతి విజయం: బాలయ్య

గౌతమీపుత్ర శాతకర్ణికి స్పందన అద్భుతం, ఇది తెలుగు జాతి విజయం: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి' సినిమాకు అన్ని ఏరియాలు, అన్ని వర్గాల నుండి అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ రోజు ఉదయం బాలయ్య, క్రిష్, శ్రీయ అభిమానులతో కలిసి ప్రసాద్ ఐమాక్స్ లో సినిమా చూసారు. ఈ సందర్భంగా వారు మీడియాతో విజయానందాన్ని పంచుకున్నారు.

బాల‌కృష్ణ మాట్లాడుతూ...సినిమాకు అద్భుత‌మై స్పంద‌న వ‌చ్చిందని, తాను కూడా ఇంత‌టి స్పంద‌న‌ను ఊహించ‌లేద‌న్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్టాలు, విదేశాల్లో కూడా సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందన్నారు. ఇది తెలుగువారి విజ‌యం, తెలుగు జాతి విజయం అని గర్వంగా చెబుతున్నట్లు బాలయ్య వ్యాఖ్యానించారు.

చాలా విచిత్రమైన పరిస్థితుల్లో షూటింగ్ జరిగిది, ఏదో ఒక అదృశ్య శక్తి సినిమాను నడిపించడం వల్లే మాకు అన్నీ విధాలుగా కలిసొచ్చింది. ముందే చెప్పినట్లు సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేసామని బాలయ్య తెలిపారు.

 Balakrishna about Gouthamiputra Satakarni victory

సినిమా అనుకున్న సమయానికి త్వరగా పూర్తి చేయడానికి కారణమైన నిర్మాత సాయి బాబు, క్రిష్, సాకంతిక నిపుణులకు అభినందనలు, కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బాలయ్య చెప్పారు. నాన్నగారు చేయాలనుకున్న ఈ సినిమా నేను చేయడం పూర్వజన్మ సుకృతమని బాలయ్య వ్యాఖ్యానించారు.

మా అభిమానులు ఈ సినిమా చూసి ఆనందం గా ఉన్నారు, పంచభక్ష పరమాన్నాలు తిన్నంత సంతృప్తిగా ఉన్నారు. సినిమా నిర్మాణం అజరామరం. అజరామరం అనే పదానికి పూర్తి స్థాయి అర్హత ఉన్న సినిమా అని బాలయ్య తెలిపారు. ఈ సినిమా విజయం మరిన్ని మంచి చిత్రాలు ఇవ్వడానికి ప్రోత్సాహాన్ని ఇచ్చిందన్నారు బాలయ్య.

క్రిష్ మాట్లాడుతూ...ఇది తెలుగు జాతి కథ, తెలుగు జాతి సినిమా, తెలుగు వారి సినిమా, ఈ సినిమా భారతీయుడి... ప్రపంచ నలుమూలల్లో ఉన్న తెలుగు వారు, ఈ సినిమాను ఆదరిస్తున్నవారికి ధన్యవాదాలు అని తెలిపారు. నేను సినిమా కెప్టెన్ అయినప్పటికీ బాలయ్య మమ్మల్ని అందరినీ భుజాలపై మోసారని తెలిపారు.

English summary
Balakrishna feeling happy about Gouthamiputra Satakarni victory. Gautamiputra Satakarni is a 2017 Telugu epic historical action film produced by Saibabu Jagarlamudi, Y. Rajeev Reddy on First Frame Entertainment banner and directed by Krish.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu