twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాకు పోటీ ఎవ్వరూ లేరు..రారు:బాలకృష్ణ (వీడియో)

    By Srikanya
    |

    హైదరాబాద్ : ‘‘ ఎప్పుడూ నా సినిమాలే నాకు పోటీ అని భావిస్తుంటాను. నాకు మరెవ్వరూ పోటీ కాదు. నేను బతికున్నంతవరకు సినిమాలు చేస్తూనే ఉంటా. నా వారసత్వంగా నా కొడుకు కూడా సినిమాలు చేస్తాడు''అన్నారు బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన ‘డిక్టేటర్‌' పాటల విజయోత్సవం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది ఈ సందర్బంగా ఆయన స్పందించారు. ఆయన మాటల్ని క్రింద వీడియో ద్వారా చూడవచ్చు.

    బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘నువ్వెంత అనుకునేవాడికి నియంత మా ‘డిక్టేటర్‌'. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా కచ్చితంగా పండగ ఆనందాన్నిస్తుంది. ‘సింహా', ‘లెజెండ్‌' తరహాలో మరో గొప్ప విజయాన్ని అందించే చిత్రమిది. సినిమాలో సంభాషణలు అద్భుతంగా ఉన్నాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ నా సంభాషణల్ని నెమరేసుకుంటుంటారు. అదంతా రచయితల గొప్పతనం.

    తమన్‌ ఆణిముత్యాల్లాంటి పాటలు అందించాడు. నటీనటులు, సాంకేతిక నిపుణులు చక్కటి సహకారం అందించారు. నేను ఏ సినిమా చేసినా కుటుంబ వాతావరణం ఉండాలి. ఈ సినిమా కూడా అలాంటి వాతావరణంలోనే తెరకెక్కింది. ఈ సినిమాలో శ్రీవాస్‌ నన్ను మరింత స్టైలిష్‌గా చూపించాడు. అంజలి లాంటి హీరోయిన్స్ దొరికితే అద్భుతాలు సృష్టించొచ్చు. సోనాల్‌ చౌహాన్‌ బాగా నటించింది. నవరసాలున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుందనే నమ్మకముంది''అన్నారు.

    శ్రీవాస్‌ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా, నిర్మాతగా రెండు పాత్రలు పోషించడం కష్టమనుకున్నా. బాలకృష్ణగారు ఉన్నారనే ధైర్యంతో నిర్మాతగా ఈ సినిమా చేశా. మేం పేపరుపై ఏదైతే రాసుకున్నామో దాన్నే పక్కాగా తెరపైకి తీసుకొచ్చాం. బాలకృష్ణగారి అభిమానులకు విందు భోజనంలా ఉంటుందీ చిత్రము''అన్నారు.

    Balakrishna about his Competition

    అంజలి మాట్లాడుతూ ‘‘నాకు బాగా నచ్చిన సినిమా ఇది. బాలకృష్ణగారి 99వ సినిమా ఎలా ఉండాలో అలానే ఉంటుంది. శ్యామ్‌ కె.నాయుడు ప్రతి ఫ్రేమ్‌ను చాలా అందంగా చూపించారు''అన్నారు. ఈ కార్యక్రమంలో చలపతిరావు, సుమన్‌, చిన్నా, హేమ, శ్రీధర్‌ సీపాన, అజయ్‌, కాశీవిశ్వనాథ్‌, జీవీ, కౌసల్య, శ్యామ్‌.కె.నాయుడు, గౌతంరాజు, రత్నం, బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా నటీనటులు, సాంకేతిక నిపుణులకు బాలకృష్ణ జ్ఞాపికలు అందజేశారు. అంజలి, సోనాల్‌ చౌహాన్‌, అక్ష కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి శ్రీవాస్‌ దర్శకుడు. తమన్‌ సంగీతమందించారు. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మించాయి.

    నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

    English summary
    Balakrishna Says Only My Son & Grandson Are My Competition to me
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X