»   » నాలో ఆవేశం చూసి కథ తయారుచేస్తూంటారు

నాలో ఆవేశం చూసి కథ తయారుచేస్తూంటారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : జనరల్‌గా మా డైరక్టర్స్‌ కథకన్నా ముందు నా మేనరిజమ్స్‌, నాలోని ఆవేశం చూసి అందులో నుంచి ఓ పాయింట్‌ని పట్టుకుని దాని చుట్టూ కథను తయారుచేస్తారు. నిజ జీవితంలో నేను వాడే ఆంగికాన్ని వాళ్ళు సినిమాలోనూ పెడుతుంటారు అంటున్నారు బాలకృష్ణ. ఆయన తాజా చిత్రం డిక్టేటర్ విడుదల సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు.

అలాగే సినిమా గురించి చెబుతూ...డిక్టేటర్‌కి కథే కీలకం. ఆ కథలో ఉన్న పాత్రని బట్టి ఈ టైటిల్‌ని పెట్టారు. అది కాకతాళీయమో ఏమోగానీ నా సినిమాలకు చాలా వరకు ఇంగ్లిష్‌ టైటిల్స్‌ ఉంటాయి. డిక్టేటర్‌ అంటే ఒక నియంత. తను అనుకున్నదే జరగాలి అని అనుకునే వ్యక్తి. సినిమాలో కూడా నా పాత్ర అలాంటిదే అన్నారు.


ఈ టైటిల్ ఎందకు పెట్టారని ఎప్పుడూ అడగలేదు. ఈ టైటిల్‌ వినగానే టెన్షనగానే అనిపించింది. షూటింగ్‌ అయిన తర్వాత డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు చూస్తే, టైటిల్‌కి రీచ అయింది సినిమా అని అనిపించింది. డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సినిమా. ఆర్థిక వ్యవస్థను మనిషి ఎలా శాసిస్తున్నాడు అనేది ఇందులో చెప్పామని తెలిపారు.


Balakrishna about his latest Dictator

బాలకృష్ణ హీరోగా శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం డిక్టేటర్. ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అంజలి, సోనాల్ చౌహాన్, అక్ష హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జనవరి 14 న సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తూన్న, ఈ సినిమా సెన్సార్ కి ఈనెల 7 తారీకున వెళ్ళనుంది. కొద్దగా మిగిలివున్న ప్యాచ్ వర్క పూర్తిచేసుకుంటున్న ఈ సినిమా డబ్బింగ్ కూడా పూర్తపుతోంది. మరోపక్క పోస్ట్ ప్రోడక్షన్ పని కూడా వేగంగా జరుగుతోంది.


మిగతా కీలకపాత్రల్లో ...ఆనంద్ రామరాజు, సుమన్‌, పవిత్రాలోకేష్‌, నాజర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీ విశ్వనాథ్‌, పోసాని కృష్ణమురళి, ప్రభాస్‌ శ్రీను, హేమ, కబీర్‌, విక్రమ్‌ జీత్‌,అజయ్‌ తదితరులు ఇతర తారాగణం. ఈ చిత్రానికి ఫైట్స్‌: రవివర్మ, ఆర్ట్‌: బ్రహ్మకడలి, ఎడిటర్‌: గౌతంరాజు, మ్యూజిక్‌: ఎస్‌.ఎస్‌.థమన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఫోటోగ్రఫీ: శ్యామ్‌ కె.నాయుడు, రచన: శ్రీధర్‌ సీపాన, మాటు: ఎం.రత్నం, కథ, స్క్రీన్‌ప్లే: కోనవెంకట్‌,గోపిమోహన్‌, నిర్మాత: ఈరోస్‌ ఇంరట్నేషనల్‌, కో ప్రొడ్యూసర్‌, దర్శకత్వం: శ్రీవాస్‌.

English summary
Nandamuri Balakrishna's ‘Dictator’ planned for release on January, 14th. The makers are planning to submit the film for censor on 7th of this month.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu