»   » స్త్రీల అన్యాయాలను ప్రశ్నించేందుకే..: బాలకృష్ణ

స్త్రీల అన్యాయాలను ప్రశ్నించేందుకే..: బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

తిరుపతి : లెజెండ్‌ చిత్రంలో స్త్రీమూర్తిపై చిత్రించిన వివిధ సన్నివేశాలు స్త్రీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించేందుకేనని బాలకృష్ణ వెల్లడించారు. ప్రతి ఒక్కరూ స్త్రీలను గౌరవించాలన్నారు. 'దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి' అనే డైలాగ్‌ మహిళల ప్రాముఖ్యాన్ని వివరించేందుకేనని తెలిపారు. స్త్రీ లేకుంటే జీవితమే లేదని, చివరికి ఈ సృష్టేలేదన్న సందేశాన్ని ఈ చిత్రం ద్వారా తెలిపామన్నారు. అభిమానుల అభిరుచులకు అనుగుణంగా చిత్రాలు తీసేందుకు కళామతల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని బాలకృష్ణ అన్నారు. లెజండ్ యాత్రలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

అలాగే... అభిమానులు అందించే ఉత్సాహంతో మరెన్నో చిత్రాలలో నటిస్తానన్నారు. ఇక్కడ పెల్లుబికిన అభిమానం పూర్వజన్మ సుకృతంగా స్వీకరిస్తానని వివరించారు. విజయోత్సవ యాత్రలో భాగంగా పుణ్యక్షేత్రాలతో పాటు ప్రేక్షక దేవుళ్లకు కృతజ్ఞతలు తెలియజేసుకునే అవకాశం లభించిందన్నారు. బోయపాటి శీను కాంబినేషన్‌తో సింహా చిత్రం తీశాము.. ఆ తరహాలో ఉంటుందనుకున్న 'లెజెండ్‌' అద్భుతంగా వస్తుందని భావించలేదన్నారు. పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ తొలిసారి మణి పూసల్లాంటి బాణీలు సమకూర్చి ఈ చిత్రం విజయంలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పోరాట సన్నివేశాలను రక్తికట్టించడంలో రామలక్ష్మణులకు ఎవరూ సాటిరారన్నారు.

Balakrishna about Legend movie at Tirupathi

దర్శకుడు బోయపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ చిత్రం ఘనవిజయం సాధించిన నేపథ్యంలో శ్రీవారి ఆశీర్వాదం తీసుకోవడంతోపాటు మీ ఆశీర్వాదం తీసుకునేందుకే తిరుపతి వచ్చామన్నారు. మంచి సినిమా తీస్తే అభిమానులు ఎంతగా ఆదరిస్తారో.. లెజెండ్‌ చిత్రం ఘనవిజయమే నిదర్శనమన్నారు. ఇది కుటుంబ సమేతంగా చూడతగ్గ చిత్రమన్నారు. ఎప్పటికీ స్వర్గీయ నందమూరి తారక రామారావు నిజమైన 'లెజెండ్‌' అని స్పష్టం చేశారు.

తిరుపతిలో సినీనటుడు బాలకృష్ణకు అభిమానులు నీరాజనాలు పలికారు. లెజెండ్‌ సినిమా విజయోత్సవ ర్యాలీలో భాగంగా నందమూరి బాలకృష్ణ.. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో కలిసి గురువారం తిరుపతికి వచ్చారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుపతి నియోజకవర్గ తెదేపా ఇన్‌ఛార్జ్‌ చదలవాడ కృష్ణమూర్తి గజమాలతో బాలకృష్ణను సత్కరించారు.

English summary
Balakrishna, Sonal Chauhan, Radhika Apte starrer Legend directed by Boyapati Srinu is going great guns at box office. Legend is holding on, way above Trade expectations of Day 1. Whether or not it will touch 25Cr mark inside 1st week worldwide is remains to be seen.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu