»   » నాన్న వల్లే కౌంట్ తగ్గింది... ‘పైసా వసూల్’ అంటున్న బాలయ్య

నాన్న వల్లే కౌంట్ తగ్గింది... ‘పైసా వసూల్’ అంటున్న బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ నటించిన 'పైసా వసూల్' చిత్రం సెప్టెంబర్ 1న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా బాలయ్య మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. తాజాగా ఓ ప్రముఖ పత్రిక ఇంటర్వ్యూలో బాలయ్య మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమాలో ఏక్ పెగ్‌లా అనే పాట పాడిన విషయమై బాలయ్య స్పందిస్తూ.......ఏ హీరో కూడా తన గొప్పతనాన్ని కీర్తించుకుంటూ స్వంతంగా పాటలు పాడుకోలేదు. తొలిసారి నేనే ఆ పనిచేశా. నాకు నేనే పెద్ద అభిమానిని. నాన్నే నాకు గురువు, దైవం. ఆయన తర్వాత నచ్చే మనిషి ఎవరంటే నాకు నేనే అని సమాధానం చెబుతాను అని బాలయ్య అన్నారు.

పది మందికి ఉపయోగపడాలి

పది మందికి ఉపయోగపడాలి

నేను ఏది చేసినా అంకితభావం, క్రమశిక్షణతో పూర్తిచేస్తాను. నేను సంపాదించుకున్న జ్ఞానం పదిమందికి ఉపయోగపడాలని కోరుకుంటాను. సినిమా షూటింగ్‌లు లేకపోతే సాహిత్యం చదువుకుంటూ కూర్చుంటాను. సినిమాల ద్వారా తెలుగు భాషను పెంపొదించే ప్రయత్నం చేయడం ఆనందంగా ఉంది అని బాలయ్య చెప్పుకొచ్చారు.

Balakrishna Paisa Vasool Movie Climax Making Video Leaked
నాన్న ఆపకుంటే 250 సినిమాలయ్యేవి

నాన్న ఆపకుంటే 250 సినిమాలయ్యేవి

మొదట్లో నేను సినిమాల్లోకి రావడానికి నాన్న ఇష్టపడలేదు. లేదంటే ఇప్పటికీ 250 సినిమాలు పూర్తయ్యేవి. నేను నటిస్తుండగా నవ్వు సినిమాల్లోకి వస్తానంటే ఎలా ఒప్పుకుంటా అని వారించారు. చదువు పూర్తిచేసుకోమని అనేవారు అని బాలయ్య సదరు పత్రిక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

షూటింగులో నాన్న చాలా స్ట్రిక్ట్

షూటింగులో నాన్న చాలా స్ట్రిక్ట్

ఇంట్లో తండ్రిగా మమ్మల్ని గారాబంగా చూసుకున్నా సెట్స్‌లో అడుగుపెడితే మాత్రం మా ఇద్దరి మధ్య నటుడు, దర్శకుడి అనుబంధం ఉండేది. దెబ్బలు తగిలినా షూటింగ్‌ చేయాల్సిందే. అనురాగ దేవత సమయంలో కాలుకు పెద్ద గాయమైనా షూటింగుకు కోసం డిశ్చార్జ్ చేయండి అని డాక్టర్లతో చెప్పారు అని బాలయ్య గుర్తు చేసుకున్నారు.

పైసా వసూల్ షడ్రుచులు ఉంటాయి

పైసా వసూల్ షడ్రుచులు ఉంటాయి

పైసా వసూల్ అభిమానులకు విందు భోజనంలా ఉంటుంది. తేడాసింగ్‌గా నా పాత్ర వైవిధ్యంగా ఉంటుంది. మంచి కథ, పాత్రలు అన్ని చక్కగా కుదిరాయి. ఉప్పు, కారం, తీపి, వగరు చేదు ఇలా షడ్రుచులను మేళవించి విందు భోజనంగా పూరి జగన్నాథ్ ఈ సినిమాను తీర్చిదిద్దారు అని బాలయ్య తెలిపారు.

పూరి గురించి చెడ్డగా చెప్పారు

పూరి గురించి చెడ్డగా చెప్పారు

పూరి జగన్నాథ్ తన అనుభవన్నాంతా ఉపయోగించి సినిమాను అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాకు పూరి జగన్నాథ్ పేరును నేనే సూచించాను. నిర్మాత నా ఆలోచన బాగుందని అంగీకరించారు కానీ చిత్ర పరిశ్రమలో చాలా మంది ఆయన గురించి వ్యతిరేకంగా చెప్పారు. అలాంటివి నేను పట్టించుకోను. పూరి జగన్నాథ్‌ను నమ్మి సినిమా చేశాను అని బాలయ్య తెలిపారు.

దేవాంశ్ నాకు పెద్ద ఫ్యాన్స్

దేవాంశ్ నాకు పెద్ద ఫ్యాన్స్

నా మనవడు దేవాంశ్ నాకు పెద్ద ఫ్యాన్. నా పేరు తెలియదు. గోలతాత, శాతకర్ణి అంటూ పిలుస్తుంటాడు. నా సినిమాలు చూస్తుంటాడు, పాటలు విని నవ్వుతుంటాడు అని బాలయ్య తెలిపారు.

పొలిటికల్ సినిమాలు చేయను

పొలిటికల్ సినిమాలు చేయను

రాజకీయ కథాంశాలతో సినిమా అస్సలు చేయను. ఇతర కథల కంటే అవే నన్ను ఎక్కువగా వెతుక్కుంటూ వస్తున్నాయి.... కానీ నాకు అలాంటివి చేయడం ఇష్టం లేదు అని బాలయ్య తెలిపారు.

English summary
Nandamuri Nata Simham Balakrishna is ready to roar at Box office with Paisa Vasool. Paisa Vasool film produced by V. Anand Prasad under Bhavya Creations banner and directed by Puri Jagannadh.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu