»   » ఆయన నా బ్రదర్, కాంప్రమైజ్ అయ్యేరకం కాదు: బాలయ్య

ఆయన నా బ్రదర్, కాంప్రమైజ్ అయ్యేరకం కాదు: బాలయ్య

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన 'రాజా చెయ్యి వేస్తే' ఆడియో వేడుక శుక్రవారం విజయవాడలో గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు నందమూరి బాలకృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య ఈ చిత్ర నిర్మాత సాయి కొర్రపాటి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.

సాయికొర్రపాటి నా సోదరుడు, స్నేహితుడు. నాతో లెజెండ్ చిత్రాన్ని నిర్మించారు. ఆయన ఒక సినిమా కమిట్ అయ్యాడంటే కాంప్రమైజ్ అయ్యేరకం కాదు... ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించినట్లు తెలుస్తుంది. నారారోహిత్, తారకరత్న కలయిక చూస్తుంటే సినిమా డిఫరెంట్ గా అనిపిస్తుందని బాలయ్య అన్నారు.

ఈ వేడుక చూస్తుంటే రెండు కుంటుంబాల మధ్య పండగ జరుపుకొన్నట్టు ఉంది. మొన్ననే మేం తాతలం ఇద్దరం మనవడి మొదటి పుట్టినరోజును జరుపుకొన్నాం. విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం నా అదృష్టంగా భావిస్తున్నా. సాయికార్తీక్‌ పాటలు బాగున్నాయి అంటూ బాల్యయ్య ప్రశంసల వర్షం కురిపించారు. మంచి టెక్నికల్ టీం కుదిరింది. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు.

స్లైడ్ షోలో బాలయ్య ఫోటోస్....

రాజా చెయ్యివేస్తే

రాజా చెయ్యివేస్తే


రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుకలో మాట్లాడుతున్న బాలయ్య.

బాలయ్య, సాయి

బాలయ్య, సాయి


రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుకలో బాలయ్య, సాయి కొర్రపాటి.

చంద్రన్న, బాలయ్య

చంద్రన్న, బాలయ్య


రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుకలో చంద్ర బాబు, బాలకృష్ణ.

సాయి కార్తీక్

సాయి కార్తీక్


బాలయ్యతో కలిసి సాయి కార్తీక్, అతని కుటుంబ సభ్యులు.

బాలయ్య అభివాదం

బాలయ్య అభివాదం


రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుకపైకి వస్తూ స్టైలిష్ గా బాలయ్య అభివాదం.

దర్శకుడితో హీరో, విలన్

దర్శకుడితో హీరో, విలన్


దర్శకుడు ప్రదీప్ చిలుకూరితో కలిసి చిత్ర హీరో నారా రోహిత్, విలన్ తారకరత్న.

ఆడియో వేడుక

ఆడియో వేడుక


రాజా చెయ్యి వేస్తే ఆడియో వేడుక శుక్రవారం విజయవాడలో గ్రాండ్ గా జరిగింది.

English summary
Balakrishna about Raja Cheyyi Vesthe producer Sai Korrapati.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu