twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నేను అందుకే పుట్టా: బాలకృష్ణ

    By Srikanya
    |

    కొందరు కొన్ని చేయడానికే పుడతారు. శ్రీరామచంద్రుడి పాత్ర పోషించడం నా పూర్వజన్మసుకృతం. ఈ చిత్ర నిర్మాత నన్ను యాదృచ్ఛికంగా కలిశారు. అలాగే నయనతార సీత పాత్రకి వెంటనే ఒప్పుకొంది. మా బాబాయ్‌ అక్కినేని నాగేశ్వరరావు నాస్తికుడు. వాల్మీకి పాత్ర కోసం ఆయన్ని సంప్రదించగానే అంగీకారం తెలిపారు. 'శ్రీరామరాజ్యం' రూపకల్పన ఓ దైవసంకల్పం అంటున్నారు నందమూరి బాలకృష్ణ. బాపు దర్శకత్వంలో ఆయన నటించిన 'శ్రీరామరాజ్యం'చిత్రానికి సంబంధించిన 2జీబీ మెమొరీ కార్డుని బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఇందులో 18 గీతాలతోపాటు సినిమాకి సంబంధించిన ఛాయాచిత్రాలు, వాల్‌పేపర్స్‌ ఉంటాయి.వాటి విడుదల సందర్బంగా మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే వేరే దర్శకుడెవరైనా అయితే ఈ చిత్రం చేసేవాణ్ని కాదు. బాపు ఇలాంటి కథల్ని తెరకెక్కించడంలో సిద్ధహస్తులు. ఇళయరాజా స్వరపరచిన ఈ పాటలు విని తెలుగువారెంతో ఆనందపడుతున్నారు. సినిమా గురించి ఎంతగానో ఊహించుకొంటున్నారు. కచ్చితంగా వారి అంచనాల్ని అందుకుంటాం. విలువల్ని గుర్తు చేస్తూ, వసుధైక కుటుంబాన్ని చూపించేది రామాయణ కావ్యం. ఇందులో తండ్రికొడుకుల అనుబంధాన్నీ, భార్యాభర్తల ప్రేమానురాగాల్నీ, అన్నదమ్ముల అన్యోన్యతనీ చెప్పారు. మా చిత్రంలో వాటిని ఆవిష్కరించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, రేవంత్‌, ఉమేష్‌గుప్తా, సుభాష్‌గుప్తా పాల్గొన్నారు.

    ఈ చిత్రానికి పాటలు: జొన్నవిత్తుల, వెన్నెలకంటి, సినిమాటోగ్రఫీ: పి.ఆర్.కె. రాజు, కూర్పు: జి.జి. కృష్ణారావు, కళ: రవీంద్ర, గ్రాఫిక్స్: కమల్ కణ్ణన్, డాన్స్: శ్రీను, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: తాండవ కృష్ణ, స్క్రీన్‌ప్లే, మాటలు: ముళ్లపూడి వెంకటరమణ.

    English summary
    Sri Rama Rajyam movie is expected to hit the screens on September 16. This is just the tentative date and it might be changed in the coming days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X