twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిర్యానీతో, మద్యంతో ఓట్లు కొనొద్దంటూ బాలకృష్ణ

    By Srikanya
    |

    తమను నాయకులను చేయటానికి, ఓట్లేసి గెలిపించడానికి జనం కావాలి. అలాగే బహిరంగ సభల్లో నేతల కోసం చప్పట్లు కొట్టడానికి జనం కావాలి. ఇంతా చేస్తే ఆ ఓట్లేసిన వారికి ఓ బిర్యానీ పొట్లమో, మద్యమో ఎర వేసి చేతులు దులుపుకొంటారు. ఆ తర్వాత కష్టమొస్తే ఆ జనానికి నాలుగు సానుభూతి మాటలు చెప్పి మమ అనిపిస్తారు. మరి ఇలాంటి కుహానా నాయకులకు విరుధ్దంగా నిజమైన నాయకుడినీ, ప్రజల కోసం పాటుపడే వ్యక్తినీ చూడలేమా? ఈ ప్రశ్నలకు సమాధానం మా అధినాయకుడు సినిమాలో దక్కుతుంది అంటున్నారు దర్శకుడు పరుచూరి మురళి. బాలకృష్ణ అలాంటి నిజమైన నాయకుడు పాత్రలో కనపిస్తారు అన్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అధినాయకుడు'. ఈ చిత్రంలో నందమూరి బాలకృష్ణ తండ్రిగా, తాతగా, మనవడు గా మూడు పాత్రలు పోషిస్తున్నారు. లక్ష్మీరాయ్‌, సలోని హీరోయిన్స్ గా చేస్తున్నారు. బాలకృష్ణ తాత గెటప్ కి భార్యగా జయసుధ కనిపించనుంది. ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో బాలకృష్ణ, లక్ష్మీరాయ్‌లపై ఓ పాటని తీస్తారు.

    ఈ సందర్భంగా కలిసిన మీడియాతో నిర్మాత ఎమ్‌.ఎల్‌.పద్మకుమార్‌ చౌదరి మాట్లాడుతూ ''రాజకీయ నేపథ్యం ఉన్న కథ ఇది. కుటుంబ బంధాలకూ చోటుంది. బాలకృష్ణ అభినయం, మూడు పాత్రల్ని పోషించిన విధానం ఆకట్టుకొంటుంది. ముఖ్యంగా పెద్దాయన పాత్రలో ఆయన నటన అందరికీ నచ్చుతుంది. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామన్నారు. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీగా 'అధినాయకుడు" రాబోతోంది.అలాగే ఈ చిత్రం గురించి ..ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. సంగీతం: కల్యాణిమాలిక్‌.

    English summary
    Balakrishna, Parachuri Murali upcoming film tentatively titled as Adhinayakudu wrapped up a schedule in Hyderabad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X