For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాలకృష్ణను హరికృష్ణ పూనాడా? 'అఖండ'గా యూట్యూబ్ దుమ్ము దులిపేస్తున్న బాలయ్య!

  |

  నటసింహ నందమూరి బాలకృష్ణ కు చాలా సంవత్సరాలుగా సరైన హిట్ పడలేదు. చివరిగా క్రిష్ దర్శకత్వంలో గౌతమీపుత్ర శాతకర్ణి అనే హిస్టారికల్ సబ్జెక్ట్ చేసి హిట్ కొట్టిన బాలకృష్ణ ఆ తర్వాత దాదాపు మూడు నాలుగు సినిమాలు చేసినా ఏవీ వర్కౌట్ కాలేదు. తన తండ్రి జీవిత కథ నేపథ్యంలో తెరకెక్కిన కథానాయకుడు, మహానాయకుడు బయోపిక్ సిరీస్ కూడా ఆయన నిరుత్సాహపరిచింది. ఇక తనకు బాగా కలిసి వచ్చిన దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆయన ఒక సినిమా చేస్తున్నారు.

  ఈ సినిమా పేరు నిన్నటి వరకు రివీల్ చేయలేదు. మోనార్క్ మొదలు చాలా పేర్లు ప్రచారంలోకి వచ్చినా చివరికి ఈ సినిమాకి అఖండ అనే పేరు ఫిక్స్ చేశారు. ఇక నిన్న విడుదల చేసిన ఈ సినిమా టీజర్ రికార్డులు సృష్టిస్తూ ముందుకు వెళుతోంది.

  కాలభైరవుడిగా బాలయ్య

  కాలభైరవుడిగా బాలయ్య

  ఉగాది పండుగ పర్వదినాన ఈ సినిమా నుంచి నేను టీజర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే సాక్షాత్ పరమ శివుడు కొలువై ఉన్న ప్రదేశంలో దుష్టశిక్షణ చేసే కాలభైరవుడిగా ఈ టీజర్లో బాలకృష్ణను బోయపాటి చూపించారు. కాస్త కండలు గట్రా గ్రాఫిక్స్ లో చూపించినా సరే బాలకృష్ణ లుక్ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. హర హర మహాదేవ అంటూ ఆయన చెప్పిన డైలాగులు దుండగులు మీద ఆయన విరుచుకుపడిన తీరుతో మొత్తం మీద ఈ టీజర్ కు అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

  ఇంకా 24 గంటలు కూడా పూర్తికాకుండానే ఈ టీజర్ కు దాదాపు ఏడు మిలియన్ వ్యూస్ వచ్చాయి. మామూలుగానే బాలకృష్ణ-బోయపాటి సినిమా అంటే ఎనలేని క్రేజ్ ఉంటుంది. దానికి తోడు ఈ సినిమాలో అఘోరా గెటప్ అని ముందు నుంచి జరుగుతున్న ప్రచారం నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ సినిమా మీద మరింత అంచనాలు పెంచేసింది.

  బాలకృష్ణను హరికృష్ణ పూనాడా?

  బాలకృష్ణను హరికృష్ణ పూనాడా?


  ఇక ఈ సినిమా టీజర్ లో బాలకృష్ణ కనిపించిన తీరు ఆకట్టుకుంది అని చెప్పాలి. అయితే నందమూరి అభిమానులు మాత్రం కొన్ని కొన్ని యాంగిల్స్ లో బాలకృష్ణలో హరికృష్ణ కూడా కనిపించాడు అని మురిసిపోతున్నారు. బాలకృష్ణను హరికృష్ణ పూనాడా ? అన్నట్లుగా కొన్ని చోట్ల ఆయన లుక్స్ బాలకృష్ణలో కనిపిస్తున్నాయని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొత్తం మీద ఈ సినిమా కోసం చాలా ఎదురు చూస్తున్నామని సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది ఉందని బాలయ్య అభిమానులు చెబుతున్నారు.

  బాలయ్యతో పాటు బోయపాటికి లైఫ్ అండ్ డెత్

  బాలయ్యతో పాటు బోయపాటికి లైఫ్ అండ్ డెత్


  బాలకృష్ణ విషయం పక్కన పెడితే బోయపాటి శ్రీను పరిస్థితి కూడా ఏమాత్రం బాగాలేదు. ఈ సినిమా కంటే ముందు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో వినయ విధేయ రామ అనే సినిమా చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో ఇప్పుడు తెరకెక్కుతున్న అఖండ సినిమా అటు బోయపాటికి ఇటు బాలకృష్ణకు చాలా కీలకంగా మారింది. ప్రగ్యా జైస్వాల్, పూర్ణ లేడీ లీడ్ పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా మరికొందరు నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు.

  English summary
  Akhanda starring Nandamuri Balakrishna, Pragya Jaiswal and Srikanth is an upcoming Telugu movie to be released on 28 May 2021. This movie is directed by Boyapati Srinu and produced by Miryala Ravinder Reddy under Dwaraka Creations. Recently Akhanda movie teaser released and got super response.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X