»   » బాలకృష్ణ అభిమానుల కొత్త ఆలోచన

బాలకృష్ణ అభిమానుల కొత్త ఆలోచన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ అభిమానలు రీసెంట్ గా ఆయన్ని తాము ఎలా చూడాలనుకుంటున్నారో ఓ ఫోటో డిజైన్ చేసి నెట్ లో వదిలారు. ఆ ఫోటోకు రాజసం అనే టైటిల్ పెట్టి మరీ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లో పెట్టారు. అశ్వనీదత్ నిర్మాతగా బాలకృష్ణ హీరోగా ఆ సినిమా చేయాలని వారి కోరిక.దాన్ని వారు ఇలా వ్యక్తం చేసారు. ఇప్పుడా పోస్టర్ డైరక్ట్ సినిమా పోస్టర్ లా అన్ని చోట్లా ప్రశంసలు పొందుతూ అభిమానులను అలరిస్తోంది. ఇక శక్తి సినిమాతో చతికలపడ్డ అశ్వనీదత్ తమ హీరోతో సినిమా చేసి హిట్టు కొట్టి మళ్ళీ పుంజుకుంటారని భావిస్తున్నట్లున్నారు. అలాగే ఆ చిత్రానికి సింహా వంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీనుని దర్శకుడుగా వారు ఎంచుకున్నారు. మరి బాలకృష్ణ వారి కోరిక తీరుస్తారో లేదో చూడాలి. అప్పటివరకూ ఈ టైటిల్ తో ఉన్న పోస్టర్ తోనే సరిపెట్టుకోవాలి.

English summary
Nandamuri fans designed a poster of Balakrishna with title Rajasam and posted the poster on Social Networking platform. And they are requesting Boyapati Srinu to direct this film and Ashwini Dutt to produce the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu