twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాన్నగారు ఆ పాత్రలు చేయలేదు - నందమూరి బాలకృష్ణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : నారదుడిగా, ఆంజనేయస్వామిగా, జర్నలిస్టుగా నాన్నగారు నటించలేదు. అలాగే 'రౌడీరాముడు-కొంటెకృష్ణుడు'లో ఆంజనేయుడిగా కనిపించాను. అదీ నాన్న చేయని పాత్రే. నిఈ మూడు పాత్రలు నేను చేయడం యాదృచ్ఛికమే అయినా... గర్వంగా ఉంది అన్నారు బాలకృష్ణ. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం 'శ్రీమన్నారాయణ'. పార్వతి మెల్టన్‌, ఇషాచావ్లా హీరోయిన్స్ . రవికుమార్‌ చావలి దర్శకత్వం వహించారు. రమేష్‌ పుప్పాల నిర్మాత. చక్రి సంగీతం అందించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ట్రిపుల్‌ ప్లాటినమ్‌ డిస్క్‌ వేడుక జరిగింది. చిత్ర హీరోయిన్స్ తో కలిసి ఛార్మి... బాలకృష్ణకు జ్ఞాపికను అందజేశారు. అనంతరం బాలకృష్ణ మాట్లాడుతూ ఇలా స్పందించారు.

    అలాగే ...''నాన్నగారు తెలుగు తెరపై ఎన్నో పాత్రలు చేశారు. ఆయన పోషించని పాత్రలు ఇప్పుడు నాకు దక్కుతుండడం చాలా ఆనందంగా ఉంది. కత్తి కన్నా కలం గొప్పదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి శక్తిమంతమైన పాత్రికేయుడిగా కనిపిస్తాను. నవరసాలు మేళవించిన కథాంశమిది. ప్రజల నాడి తెలిసిన దర్శకుడు రవికుమార్‌ చావలి. ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'సింహా' తర్వాత చక్రి నా సినిమాకి బాణీలందించారు. ఈ చిత్రం కూడా 'సింహా'లా విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. బాలకృష్ణ సినిమాల్లోనే మాకు మంచి పాత్రలు దక్కుతుంటాయని నా కథానాయికలు చెబుతుంటారు. ఈ చిత్రంలోనూ ఇషాచావ్లా, పార్వతి మెల్టన్‌లకు మంచి పాత్రలే దక్కాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాను'' అన్నారు.

    ఇక ''ఆస్ట్రేలియాలో జరిగిన అండర్ 19 ప్రపంచకప్‌లో మన భారత జట్టు గెలిచిన రోజు ఇది. అలాగే ఈరోజు ఇక్కడ న్యూజిల్యాండ్‌పై భారత్ తొలి టెస్ట్ విజయం సాధించింది. ఈ సినిమాలో కూడా క్రికెట్‌కి సంబంధించిన పాట ఉంది. 'తకతై తకతై నువ్వునేను ఒకటై ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడుదామా' అంటూ ఆ పాట సాగుతుంది. పాటలు హిట్ అయితే సినిమా సగం హిట్టైనట్లే. ఆ రకంగా మొదటి ఘట్టం పాస్ అయ్యాం'' అన్నారు.

    దర్శకుడు మాట్లాడుతూ ''రీరికార్డింగ్‌ పూర్తయ్యాక సినిమా చూశాను. విజయంపై మరింత నమ్మకం పెరిగింది. బాలకృష్ణ నటన చాలా బాగుంది'' అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. ''ఈ చిత్రాన్ని బాలయ్య మరో స్థాయికి తీసుకెళ్లారు. పాటలు విడుదలవ్వగానే గొప్ప స్పందన లభించింది. ఈ నెల 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. చక్రి మాట్లాడుతూ..''బాలకృష్ణకి ఎలాంటి పాటలు కావాలో అర్థమైంది. ఆయన అభిమానుల కోసమే ఈ పాటలు రూపొందించాం. వంద రోజుల పండగ తప్పకుండా చేసుకొంటామ''న్నారు. ఛార్మి మాట్లాడుతూ ''ఈ సినిమా కోసం బాలకృష్ణ అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో నేనూ అంతే ఎదురు చూస్తున్నా. ఈ చిత్రం విడుదలైన రోజు తొలి ఆటనే చూస్తాను''అన్నారు.

    మంచు మనోజ్‌ మాట్లాడుతూ ''షూటింగ్‌ జరుగుతున్నప్పుడు సెట్‌కి వెళ్లాను. అప్పుడు పాట చిత్రీకరణ జరుగుతోంది. అన్నయ్య డ్యాన్స్‌ చూసి అక్కడే విజిల్‌ వేశా'' అన్నారు. శ్రీకాంత్‌ మాట్లాడుతూ ''బాలకృష్ణతో కలిసి క్రికెట్‌ ఆడాను. గెలవాలనే పట్టుదలతో ఆడతారాయన. 'శ్రీరామరాజ్యం'లో ఆయనతో కలిసి నటించడం ఎప్పటికీ మరిచిపోలేను'' అన్నారు. ''మంచి పాత్రలు దొరికాయి. బాలకృష్ణతో కలిసి నటించడం ఆనందంగా ఉంది''అన్నారు హీరోయిన్స్ .ఈ కార్యక్రమంలో అచ్చిరెడ్డి, ఎస్‌.వి.కృష్ణారెడ్డి, బెల్లంకొండ సురేష్‌, గీత రచయితలు ప్రవీణ్‌ లక్మ, బాలాజీ, కందికొండ, ఆర్‌.పి.పట్నాయక్‌, ఘటికాచలం, వి.సురేష్‌రెడ్డి, రాజా రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

    English summary
    Nandamuri Balakrishna's 'Srimannarayana' Triple Platinum Disc function held in Hyderabad. Srimannaryana ready to release on August 30. Balayya would be seen as a powerful TV journalist in this movie, which is directed by Ravikumar Chavali. Isha Chawla and Parvati Melton have played the lead roles in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X