»   » బాపు, బాలకృష్ణ చిత్రం కన్ఫర్మ్..టైటిల్ ఏంటంటే

బాపు, బాలకృష్ణ చిత్రం కన్ఫర్మ్..టైటిల్ ఏంటంటే

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ, దర్సకుడు బాపుల కాంబినేషన్ లో లవకుశ రీమేక్ కన్ఫర్మ్ అయింది. రామరాజ్యం అనే టైటిల్ పెట్టనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 30 న ఈ చిత్రం ప్రారంభం కానుంది. ఈ చిత్రంలో సీతగా మాధురీ దీక్షిత్ ని అడగనున్నారు. ఆమె దొరకకపోతే నయనతారని ఎప్రోచ్ కావాలని ప్లానింగ్ లో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రాన్ని నిర్మాత యలమంచలి సాయిబాబు నిర్మిస్తున్నారు. అలాగే సంగీతానికి ఇళయారాజాని తీసుకుంటున్నారు. ఇక బాబు...ఛార్మీ, అల్లరి నరేష్ తో చేసిన సుందరాకాండ తర్వాత ఏ చిత్రమూ చేయలేదు. తాజాగా ఈ బారీ బడ్జెట్ కి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, అంజలీదేవి, చిత్తూరు నాగయ్య, కాంతారావు ప్రధాన పాత్రధారులుగా సిఎస్‌ఆర్, సి.పుల్లయ్య సంయుక్త దర్శకత్వంలో 1963లో రూపొందిన మైథలాజికల్ క్లాసిక్ 'లవకుశ". అలాగే ఇంతకు ముందు బాలకృష్ణ ఎన్‌ టిఆర్ నటించిన పాండురంగ మహాత్మ్యం చిత్రాన్ని పాండురంగడు పేరుతో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu