నట‘సింహం’ బాలకృష్ణకు ఇంటర్నేషనల్ అవార్డు..!
గతంలో వంశీ - బర్క్లీ పేరిట ప్రతి సంవత్సరం సినిమా అవార్డుల ప్రధానోత్సవం జరిగేది. ఇప్పుడు ఆ అవార్డులను వంశీ టాలీవుడ్ ఫిల్మ్ అవార్డులగా పేరుమార్చి ప్రధానం చేయనున్నారు. ఇకనుండి ప్రతి సంవత్సరం దర్శకరత్న దాసరి నారాయణ రావు జన్మదినం నాడు ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహిస్తారు.
2009 -2010 సంవత్సరాలకు గాను తెలుగు సినిమా రంగంలో ప్రతిభ కనబరచిన నటీనటులకు మే 3వ తారీఖున వంశీ టాలీవుడ్ ఫిల్మ్ అవార్డులు బహుకరించానున్నారు. అంతే కాకుండా 2009 సంవత్సరానికి గాను ప్రముఖ నిర్మాత రాఘవ ను లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతోను, 2010 సంవత్సరానికి గాను ఎన్టీఆర్-వంశీ ఇంటర్నేషనల్ అవార్డు తో నటసింహం బాలకృష్ణను సత్కరించనున్నారు. ఇంకా ఈ వేదికపై పలువురు కళాకారులు అవార్డులు అందుకోబోతున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి ముఖ్య అతిదిగా హాజరు కానున్నారు. మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, దాసరినారాయణరావు, డా.సి నారాయణ రెడ్డి తదితర ప్రముఖులు విశిష్ట అతిదులుగా పాల్గొంటారు.


Click it and Unblock the Notifications











