»   » బాలయ్య బాబు గురించే చర్చ, ఫ్యాన్స్ షాక్!

బాలయ్య బాబు గురించే చర్చ, ఫ్యాన్స్ షాక్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ‘బాలయ్య బాబు సినిమాలకు దూరం అవుతున్నారా..?' అనే ప్రశ్న ఇపుడు అభిమానులను వేధిస్తోంది. 100వ సినిమా తర్వాత బాలయ్య సినిమాలు తగ్గిస్తారని, పూర్తి స్థాయిలో రాజకీయాల్లో కొనసాగుతారనే ప్రచారం ఇపుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం తన 99వ మూవీ డిక్టేటర్ లో నటిస్తున్న ఈ టాలీవుడ్ సీనియర్ స్టార్... తన వందో సినిమాకు సీరియస్ గా కథలు వింటున్నాడు.

ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బాలకృష్ణ వందో సినిమా తరువాత ఫుల్ టైమ్ పాలిటిక్స్ మీద దృష్టి పెడతానని చెప్పడంతో... బాలకృష్ణ సినిమాలు తగ్గించుకోబోతున్నాడనే ప్రచారం జోరందుకుంది. బాలకృష్ణ వందో సినిమా తరువాత ఆయన తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ ఉంటుందని అంటున్నారు. కుమారుడిని హీరోగా పరిచయం చేసి తరువాత పూర్తి స్థాయిలో రాజకీయాలపై దృష్టి పెట్టాలన్నది బాలయ్య ఆలోచన కావొచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.

బాలయ్య ప్రస్తుతం నటిస్తున్న ‘డిక్టేటర్' సినిమా విషయానికొస్తే...
లక్ష్యం, రామ రామ కృష్ణ కృష్ణ, పాండవులు పాండవులు తుమ్మెద, లౌక్యం చిత్రాల దర్శకుడు శ్రీవాస్ దర్శకత్వంలో ‘డిక్టేటర్' మూవీ తెరకెక్కుతోంది. బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ఈరోస్ ఇంటర్నేషనల్, వేదాశ్వ క్రియేషన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.

Balakrishna becomes full time politician after his 100th movie

ఈ మధ్య తమన్ తన ప్రతి సినిమాలోనూ హీరోతో పాట పాడిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రంలో కూడా బాలయ్యతో పాట పాడించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. బాలయ్య పాట పడితే సినిమాకు మంచి పబ్లిసిటీ వస్తుందని, అది సినిమాకు మరింత ప్లస్సయ్యే అవకాశం ఉండటంతో బాలయ్య కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను బాలయ్య ఇప్పటి వరకు చేసిన చిత్రాలకంటే స్టైలిస్ గా, రిచ్ గా ఉండేలా డైరెక్టర్ శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల డైరెక్టర్ శ్రీవాస్, ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మకడలి, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు యూరఫ్ వెళ్లి షూటింగ్ లొకేషన్స్ పరిశీలించి వచ్చారు. ఇప్పటి వరకు ఏ చిత్రం షూటింగ్ చేయనటువంటి లొకేషన్స్ లో ఈ సినిమా సాంగ్స్, టాకీ, యాక్షన్ పార్ట్ చిత్రీకరించేందుకు శ్రీవాస్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ‘లెజెండ్' సినిమాలో బాలయ్యతో నటించిన సోనాల్ చౌహాన్ ఈ చిత్రంలో మరో హీరోయిన్ గా ఎంపికైంది. బాలకృష్ణ, సోనాల్ చౌహాన్, అంజలి కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకత్వంతో పాటు ప్రొడక్షన్ బాధ్యతలు కూడా నిర్వహిస్తుండటంతో సినిమా పట్ల చాలా కేర్ తీసుకుని సినిమాని స్టైలిస్, గ్రాండ్ లెవల్ లో రూపొందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వీ, కాశీ విశ్వనాథ్, సుప్రీత్, అమిత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్ష్: రవి వర్మ, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మకడలి, ఎడిటర్: గౌతంరాజు, మ్యూజిక్: ఎస్ఎస్.థమన్, ఫోటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, రచన: శ్రీధర్ సీపాన, మాటలు: ఎం.రత్నం, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, నిర్మాత: ఈరోస్ ఇంటర్నేషనల్, దర్శకత్వం-సహ నిర్మాణం: శ్రీవాస్.

English summary
Film Nagar source said that, Balakrishna becomes full time politician after his 100th movie.
Please Wait while comments are loading...