»   » తాతను కాబోతున్నా: బాలకృష్ణ ప్రకటన

తాతను కాబోతున్నా: బాలకృష్ణ ప్రకటన

Posted By:
Subscribe to Filmibeat Telugu

తుని : త్వరలో తాను తాతను కాబోతున్నానని ప్రముఖ సినీ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో బుధవారం రాత్రి జరిగిన ఓ వివాహ వేడుకకు ఆయన హాజరై సందడి చేశారు. తన మిత్రుడైన చల్లకొండ రమేష్‌ కుమార్తె వివాహానికి హాజరై వధూవరులు నాగేశ్వరి, సురేష్‌లను ఆశీర్వదించారు. తాను త్వరలో తాతను కాబోతున్నానని చెప్పడంతో ఒక్కసారిగా అభిమానులు కేరింతలు కొట్టారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

ఇక బాలకృష్ణ తాజా చిత్రం విషయానికి వస్తే...

గతేడాది 'లెజెండ్‌'తో విజయాన్ని సొంతం చేసుకొన్న బాలకృష్ణ త్వరలో 'లయన్‌'గా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే . బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'లయన్‌'. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. రుద్రపాటి రమణారావు నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో షూటింగ్ జరుగుతోంది.

Balakrishna becoming grandfather!

దర్శకుడు మాట్లాడుతూ... ''సామాన్యుడికి బాసటగా నిలిచే ఓ వ్యక్తి కథతో రూపొందుతున్న చిత్రమిది. శక్తిమంతమైన పాత్రతో మరోసారి అలరించబోతున్నారు బాలకృష్ణ. ''అని తెలిపారు.

ఇటీవల హైదరాబాద్‌లో హీరో పరిచయ సన్నివేశాల్ని భారీస్థాయిలో తెరకెక్కించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పవర్ఫుల్ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించనున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరబాద్ శివార్లలోని మొయినాబాద్ ప్రాంతంలో జరుగుతోంది. అక్కడ బాలకృష్ణపై ఓ పవర్ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ ని షూట్ చేస్తున్నారు. క్రేజీ ఫైట్ మాస్టర్స్ అయిన రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ ఈ యాక్షన్ ఎపిసోడ్ ని కంపోజ్ చేస్తున్నారు. ఈ ఎపిసోడ్ మరింత బాగా రావడానికి రెయిన్ ఎఫెక్ట్ ని కూడా జత చేసారు. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈ వారాంతం వరకూ అక్కడే జరగనుంది.

న్యూ ఇయర్ కానుకగా ఫస్ట్ టీజర్ రూపంలో నందమూరి బాలకృష్ణ తన ‘లయన్' ఇప్పటికే పరిచయం చేసారు. బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో త్రిషతో పాటు రాధిక ఆప్టే కూడా మరో హీరోయిన్ గా కనిపించనుంది. సత్యదేవా దర్శకుడుగా పరిచయమవుతూ చేసిన ఈ సినిమాకి రుద్రపాటి రమణారావు నిర్మాత. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని మార్చి చివర్లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.

'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.

బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.

English summary
Nandamuri Balakrishna is set to become grandfather. Brahmini – Nara Lokesh pair are expecting a baby in the next few days. This is a happy news for all the Nandamuri and TDP fans.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu