»   » అదుర్స్ : బాలకృష్ణ జన్మదిన వేడుక(ఫొటోలు)

అదుర్స్ : బాలకృష్ణ జన్మదిన వేడుక(ఫొటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నాలుగు దశాబ్దాల నట ప్రయాణం పూర్తి చేసుకొన్న నందమూరి హీరో... బాలకృష్ణ. ఇప్పటికీ ఆయనలో ఇంతైనా ఉత్సాహం తగ్గలేదు. నవ యువకుడిలా బాక్సాఫీసు దగ్గర రికార్డుల వేటని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ఈ రోజు పుట్టిన రోజు వేడుకలని అభిమానులు, శ్రేయాభిలాషులు సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు.

ఈ పుట్టినరోజు సందర్బంగా ఆయన కాన్సర్ ఆస్పత్రి లో నిర్వహించిన వేడుకల్లో సైతం పాల్గొన్నారు. అప్పుడు మీడియాతో మాట్లాడుతూ... కొన్ని లక్ష్యాలు పూర్తి చేయటం కోసమే మంత్రి పదివిని వదులుకున్నాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోనూ బసవతారకం ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని అన్నారు.

బాలకృష్ణ శైలికి తగ్గ కథ పడితే చాలు... వసూళ్ల మోత మోగుతుంది. ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన 'లెజెండ్‌'తో అదే విషయం నిరూపితమైంది. ఎవరూ వూహించని రీతిలో ఆ చిత్రం భారీ వసూళ్లు సొంతం చేసుకొంది. మాస్‌లో బాలకృష్ణకు ఉన్న పట్టు చెక్కు చెదరలేదని నిరూపించింది.

ఆయన కెరీర్‌లో చారిత్రాత్మకం, జానపదం, పౌరాణికం... ఇలా విభిన్నమైన నేపథ్యాలతో కూడిన చిత్రాలు కనిపిస్తుంటాయి. ఆ వైవిధ్యమైన ప్రయాణమే బాలకృష్ణని ఎవర్‌గ్రీన్‌ నటుడిగా నిలిపాయి.

బాలకృష్ణ పుట్టిన రోజు వేడుక ఫొటోలు స్లైడ్ షోలో...

నిజం కాదు

నిజం కాదు

చిత్రసీమలో ఇప్పుడు యూత్ దే హవా. సీనియర్‌ హీరోలు ఇక తమ వయసుకు తగ్గ పాత్రలు పోషిస్తూ ప్రయాణం చేయాల్సిందే అన్న అభిప్రాయం తరచూ వ్యక్తమవుతుంటుంది. అయితే... అది అందరి విషయంలో నిజం కావొచ్చేమో కానీ బాలకృష్ణకి మాత్రం వర్తించదు.

సరికొత్త రికార్డులు

సరికొత్త రికార్డులు

సింహం ఒక అడుగు వెనక్కి వేసిందంటే అర్థమేమిటి? తదుపరి విసిరే పంజా మామూలుగా ఉండదని! తెలుగు తెర 'సింహా' బాలకృష్ణ తీరు కూడా అంతే. నటుడిగా ఆయన ఒక అడుగు వెనక్కి వేశాడంటే... 'శ్రీమన్నారాయణ' తర్వాత 'లెజెండ్‌' అవుతుందని అర్థం చేసుకోవల్సిందే. బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు నమోదవుతాయని ఫిక్స్‌ అయిపోవాల్సిందే.

చాలా కాలం...

చాలా కాలం...

నలభయ్యేళ్లుగా హీరోగా కొనసాగుతున్నారు బాలకృష్ణ. ఇప్పటికీ ఆయనలో వన్నె తగ్గలేదు. నటనలో పదును ఆరలేదు.

అదే రహస్యం

అదే రహస్యం


ఆయన కెరీర్ హిట్ కి కారణమేమిటి అని ఆరా తీస్తే... ఆయన ఎంచుకొనే విభిన్నమైన పాత్రలే అన్న సమాధానం వినిపిస్తుంది. చేసే ప్రతీ పాత్ర, వేసే ప్రతీ అడుగు కొత్తగా ఉండాలని తపించే హీరో ఆయనన.

అదే నమ్మకం

అదే నమ్మకం

తెలుగు ప్రేక్షకులు కొత్తదనానికి పట్టం కడతారని గట్టిగా నమ్ముతుంటారు. ఆ నమ్మకంతోనే ఎప్పటికప్పుడు కొత్త పాత్రల్ని భుజాన వేసుకొంటుంటారు.

నాన్నగారే...

నాన్నగారే...

పాత్రల ఎంపికలో నాన్నగారే స్ఫూర్తి అని తరచుగా చెబుతుంటారు బాలకృష్ణ. ''కొత్త కథల్ని ఎంచుకోవడంలోనూ, కొత్త పాత్రల్ని పోషించడలోనూ నాన్నగారు చేసినన్ని సాహసాలు మరెవ్వరూ చేయలేదు. ఎప్పటికీ ఆయన అడుగుజాడల్లోనే నడుస్తా'' అంటారు బాలకృష్ణ.

కొత్త ఉత్సాహం...

కొత్త ఉత్సాహం...

'లెజెండ్‌' అందించిన విజయం బాలకృష్ణలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మళ్లీ హిట్స్ ఇస్తానని దూసుకుపోతున్నారు.

పాలిటిక్స్ లోకి వచ్చినా

పాలిటిక్స్ లోకి వచ్చినా

ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైనా ఆయన నటనకు మాత్రం దూరం కాలేదు. కొత్త సినిమా కమిటయ్యారు

మూడు కోణాల్లో...

మూడు కోణాల్లో...

ఇటీవలే కొత్త సినిమాకి కొబ్బరికాయ కొట్టారు. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం ఈ నెలాఖరులోపు సెట్స్‌పైకి వెళ్లబోతోంది. బాలయ్య ఇందులో ఒకే పాత్ర పోషిస్తున్నా... అందులో మూడు కోణాలు ఉంటాయని దర్శకుడు చెబుతున్నాడు.

డైలాగు అదుర్స్

డైలాగు అదుర్స్

'నేను కొడితే చరిత్రలో వినిపిస్తుంది...' అంటూ ముహూర్తపు సన్నివేశంలో బాలయ్య చెప్పిన సంభాషణ ఇప్పటికే అభిమానుల్లో అంచనాల్ని పెంచింది.

మళ్లీ హిస్టరీ రిపీట్

మళ్లీ హిస్టరీ రిపీట్

ఈ చిత్రం తర్వాత మళ్లీ బాలకృష్ణ... బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రజల మధ్యకు...

ప్రజల మధ్యకు...

సేవా కార్యక్రమాల్లో బాలకృష్ణ ముందుంటారు. బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌కి ఛైర్మన్‌గా ఆయన సేవలు అందిస్తున్నారు.

ప్రజల కోసం...

ప్రజల కోసం...

ఇటీవల హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. దీంతో ప్రజలకోసం, సేవాకార్యక్రమాల కోసం మరింత సమయం కేటాయించాలని ఆయన నిర్ణయం తీసుకొన్నట్టు తెలుస్తోంది.

నెలలో కొన్ని రోజులు..

నెలలో కొన్ని రోజులు..

ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే... నెలలో కొన్ని రోజులపాటు తన నియోజకవర్గంలో గడపాలని నిర్ణయించ్నారని సమాచారం.

పౌరషానికి..

పౌరషానికి..

పౌరుషం చూపించే పాత్రల్లో బాలకృష్ణ కి తిరుగేలేదనేది చరిత్ర చెప్పిన పాఠం. అందుకే ఆయన సినిమా అంటే ఎమోషన్స్ కి పెద్ద పీట ఉంటుంది.

డైలాగులు

డైలాగులు

బాలకృష్ణ తెరపై చెప్పే డైలాగులకు విజిల్ వేయని వారు ఉండరు. విలన్ ను చూస్తూ ఆయన చెప్పే పెద్ద పెద్ద డైలాగులతో ధియోటర్లు దద్దరిల్లుతాయి..అందుకే ఆయన కోసం మాటల రచయితలు ప్రత్యేకంగా కష్టపడుతూంటారు.

నమ్మితే..

నమ్మితే..

బాలకృష్ణ కో గొప్ప లక్షణం ఉందని ఆయనతో పనిచేసిన వారు చెప్తారు. ఆయన ఓ సారి స్క్రిప్టుని, దర్శకుడుని నమ్మితే ఇక దేంట్లోను వేలు పెట్టరు.

దర్శకుడుకి విలువ

దర్శకుడుకి విలువ

చాలా మంది యువ హీరోలు ఎదురుక్కొంటున్న విమర్శలకు బాలయ్య దూరం. ఆయన దర్శకుడుకి పూర్తి స్వేచ్చ ఇస్తారు. ఇలా చేయి...అలా చేయి అంటూ డైరక్షన్ మొదలెట్టరు.

సక్సెస్ రేటు ఎక్కువే

సక్సెస్ రేటు ఎక్కువే


బాలకృష్ణ కెరీర్ మొదటి నుంచి సక్సెస్ రేటు బాగా ఎక్కువ. ఆయన ఎంచుకునే కధాంశాలు, చేసే సాహసాలు ఆయన్ని ఇప్పటికీ యంగ్ హీరోలకు పోటీ ఇచ్చేలా చేస్తున్నాయి

శుభాకాంక్షలు

శుభాకాంక్షలు


ఆయన పుట్టిన రోజు సందర్భంగా వన్ ఇండియా తెలుగు శుభాకాంక్షలు తెలుపుతూ...మరిన్ని సూపర్ హిట్స్ తెలుగువారికి అందించి అలరించాలని కోరుకుంటోంది.

English summary
Nandamuri Balakrishna Celebrating his birthday today ( June 10). Born to late Sri Nandamuri Taraka Rama Rao, Balakrishna is known for his high voltage roles and powerful dialogues.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu