»   » దుబాయి ఎడారిలో బాలకృష్ణ ఛేజింగ్స్

దుబాయి ఎడారిలో బాలకృష్ణ ఛేజింగ్స్

Posted By:
Subscribe to Filmibeat Telugu
హైదరాబాద్ : బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందిస్తున్న తాజా చిత్రం జూలై రెండవ వారం నుంచి దుబాయి లో ప్రారంభం కానుంది. అక్కడ ఎడారిలో స్పెషల్ ఛేజ్ సీక్వెన్స్ లు ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. సినిమాకు హైలెట్ అయ్యే ఆ సీన్స్ ప్రారంభంలోనే తియ్యాలని బోయపాటి నిర్ణయించుకుని ప్లాన్ చేసాడని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన ఛార్మిని ఎంపిక చేసినట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. చేతిలో ప్రేమ ఒక మైకం చిత్రం తప్ప మరే చిత్రమూ లేని ఛార్మి ఈ ఆఫర్ రాగానే ఎగిరి గంతేసి ఒప్పుకుందని చెప్తున్నారు. అయితే అథికారికంగా ప్రకటన వస్తేగానీ నిజం ఏదనేది తెలియదు.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్ సంస్థ ఈచిత్రాన్ని ప్రొడక్షన్ నెం.4గా నిర్మిస్తోంది. హైదరాబాద్‌లోని 14రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ సంస్థ కార్యాలయంలో పార్మల్ పూజా కార్యక్రమం జూన్ 3వ తేదీనే జరిగింది. బాలయ్య జన్మదినాన్ని పురస్కరించుకుని జూన్ 10న షూటింగ్ ప్రారంభమైంది.

ఈ చిత్రానికి నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయికొర్రపాటి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు ఇటీవల మాట్లాడుతూ.... సింహా తరవాత నందమూరి బాలకృష్ణతో సినిమా చేయబోతున్నా. అంచనాలు ఏ విధంగా ఉంటాయో తెలుసు. 'సింహా'ని మించే సినిమా తీస్తా... అని చెబితే అది తొందరపాటు అవుతుంది. కానీ ఆ స్థాయికి మాత్రం తగ్గదు అంటున్నారు బోయపాటి.

English summary
Balakrishna’s new film with Boyapati Sreenu is all set for its shoot. Regular shooting will begin in Dubai from mid July. We have been hearing reports that special chase sequences will be shot in the desert in and around Dubai.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu