»   » నందమూరి వారి వివాహ మహోత్సవం (మరిన్ని ఫోటోలు)

నందమూరి వారి వివాహ మహోత్సవం (మరిన్ని ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటసింహా బాలకృష్ణ రెండో కూతురు తేజస్విని గీతమ్స్‌ గ్రూప్‌ అధినేత ఎంవివిఎస్‌ మూర్తి మనవడు శ్రీభరత్‌ని వివాహం ఘనంగా జరిగింది. నేటి ఉదయం 8.52 నిమిషాలకు ఈ జంట మూడుముళ్ల బంధంతో ఒకటి అయ్యారు. హైదరాబాద్‌ హైటెక్స్‌ లో వివాహమహోత్సవ వేడుకకు సినీరాజ కీయ రంగ ప్రముఖులతో పాటు పారిశ్రామిక వేత్తలు, ఇరుగుపొరుగు రాష్ట్రాల నుంచి ప్రముఖులంతా విచ్చేసారు.


సినీ, పారిశ్రామిక దిగ్గజాలు ఈ వేడుకకు హాజరవుతుండడంతో భారీగా రక్షణ వలయాల్ని కూడా ఈ వేడుకల్లో ఏర్పాటు చేశారు. వేకువజాము 5 గం.ల నుంచే హైటెక్స్‌లో అతిధులతో పరిణయం హడావుడి మొదలైంది. ప్రముఖులంతా ఈ వివాహానికి హాజరయ్యి...వధూవరులకు తమ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. బాలకృష్ణ తన దైన శైలిలో అందరినీ పలకరిస్తూ వివాహ వేడుకను అందంగా,ఆనందంగా జరిగేలా పర్యవేక్షిస్తూ పాల్గొంటున్నారు.

ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు నందమూరి అభిమానుల రాకతో సందడి నెలకొంది. వివాహ వేడుకకు నారా చంద్రబాబు నాయుడు, రామోజీరావు, కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు, పురందేశ్వరి, చిరంజీవి, జైపాల్‌రెడ్డి, తమిళనాడు గవర్నర్‌ రోశయ్య, 'ఈనాడు' ఎండీ కిరణ్‌, మార్గదర్శి ఎండీ శైలజాకిరణ్‌, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాగుంట శ్రీనివాసుల రెడ్డి, కనుమూరి బాపిరాజు, రాయపాటి సాంబశివరావు, తేదేపా నేతలు యనమల రామకృష్ణుడు, ఎర్రబెల్లి దయాకర్‌రావు, అంబికాకృష్ణ, దేవినేని ఉమా, కరణం బలరాం, భాజపా నేత బండారు దత్తాత్రేయ హాజరయ్యారు.

తేజస్విని...

తేజస్విని...

కారు దిగి పెళ్లి మండపం దగ్గరకు వచ్చిన తేజస్వినికి సంప్రదాయ పద్దతిలో లోపలికి తీసుకు వెళ్లి...వివాహం జరిపించారు. ఆమెను అత్తలు,అమ్మ, అక్క, మిగతా కుటుంబ సభ్యులు ఆత్మీయంగా రిసీవ్ చేసుకున్నారు.

ముచ్చటగా...

ముచ్చటగా...

బాలకృష్ణ ...మొదటి నుంచి తన పిల్లలను క్రమశిక్షణతో పెంచారనే పేరు ఉంది. అదే విషయం అక్కడ అందరూ ఆమె అణుకువ చూసి మాట్లాడుకున్నారు.

ఇదే కారులో...

ఇదే కారులో...


పెళ్లి కుమార్తె ... మండపానికి ఈ కారునే ఉపయోగించింది. ఈ కారులో వచ్చిన ఆమెను సాదరంగా పెళ్లి జనం ఆహ్వానించారు.

మురిసిపోయారు.

మురిసిపోయారు.

బాలకృష్ణ...తన కూతురుని ఇలా పెళ్లి కుమార్తె డ్రస్ లో చూసి మురిసి పోయారు. ఆయన దగ్గర ఉండి ఆమెను లోపలకి తీసుకు వెళ్లారు.

సినీ ప్రముఖలు...

సినీ ప్రముఖలు...

అలాగే సినీనటులు మోహన్‌బాబు, మంచు మనోజ్‌, లక్ష్మి, దాసరి నారాయణరావు, వెంకటేష్‌, గోపీచంద్‌, మురళీమోహన్‌, పరుచూరి బ్రదర్స్‌, జయసుధ, రాఘవేంద్రరావు, రామానాయుడు తదితరులు వచ్చి వధూ,వరులకు శుభాకాంక్షలు అందచేసారు.

చంద్రబాబు

చంద్రబాబు

వివాహ వేడుకలో ఇలా నారా చంద్రబాబు నాయుడు, యనమల రామకృష్ణుడు కూర్చుని...మధ్య మద్యలో మాట్లాడుకుంటూ కనిపించారు.

పల్లకీలో...

పల్లకీలో...

పెళ్లి కూతురుని ఇలా పల్లకీలో వివాహ మండపం దాకా తీసుకువచ్చారు. సంప్రదాయబద్దంగా ఈ వివాహాన్ని బాలకృష్ణ జరిపిస్తున్నారు.

స్పెషల్ గా..

స్పెషల్ గా..

ఈ వివాహానికి వచ్చిన వారికి బాలకృష్ణ అద్బుతమైన రీతిలో ..వివధ రకాల స్పెషాలిటిలతో విందు ఏర్పాటు చేసారు. అందరూ పెళ్లి పూర్తయ్యే దాకా ఉండి... వధూవరూలను ఆశ్వీరదించి వెళ్ళారు.

నందమూరి కళ్యాణ్ రామ్...

నందమూరి కళ్యాణ్ రామ్...

ఈ వివాహానికి నందమూరి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో డ్రెస్ చేసుకుని సకుటుంబ సపరివారంగా హాజరయ్యారు. తన బాబాయ్ కు ఆయన చేదోడు,వాదోడుగా గత కొద్ది రోజులుగా పెళ్లి పనుల్లో ఉంటూ వస్తున్నారు.

నారా లోకేష్...

నారా లోకేష్...

బాలకృష్ణ పెద్ద అల్లుడు ,చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఈ వివాహానికి హాజరయ్యి..కొన్ని పనుల్లో తన మామకు సహకారం అందించారు. అలాగే తెలుగుదేశం నాయకులను ఆయన దగ్గరుండి ఆహ్వానించారు.

స్వయంగా..

స్వయంగా..

ఈ వివాహం కోసం గత నెల రోజులుగా గ్రాండ్ గా ఏర్పాట్లు చేసారు. బాలకృష్ణ పర్యవేక్షణలో సంప్రదాయం,ఆధునికత కలగిసేలా ఈ వేడుక ని డిజైన్ చేసారు. నందమూరి వారి ఇంట వివాహం కావటంతో ఎక్కడెక్కడి వారు వస్తారని,అందుకు తగిన విధంగా కళ్యాణ మండపం ముస్తాబు చేసారు.

English summary
Balakrishna’s second daughter Tejaswini who is learning Engineering in hyderabad is equipped to enter wed lock. she is going to be marring the grandson of MVVS Murthy who is that the president of GITAM University, Visakhapatanam. The bride groom could be a engineer in USA. Nandamuri Family,relatives and close friends from Film Industry,Political&Business circiles attended the Royal wedding. 
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu