twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వినాయకుడు పాట ఎత్తుకున్న బాలకృష్ణ

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణ హీరోగా ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ‘డిక్టేటర్'అనే భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. అంజలి, సోనాల్‌ చౌహాన్‌ హీరోయిన్స్. ఎరోస్‌ ఇంటర్నేషనల్‌, వేదాశ్వ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రంలో బాలయ్య ఆహార్యం వేషధారణ సరికొత్తగా ఉండేలా సన్నాహాలు చేస్తున్నారు. బాలకృష్ణ నటిస్తున్న 99వ సినిమాగా రూపొందుతోంది. బాలకృష్ణపై హైదరాబాద్ లో ఇంట్రడక్షన్ సాంగ్ తీస్తున్నారు.

    రామజోగయ్య శాస్త్రి రచించిన ఈ గీతానికి ప్రేమ్‌రక్షిత్‌ నృత్యరీతులు సమకూరుస్తున్నారు. ఈ పాట కోసం హైదరాబాద్‌ శివార్లలో కళాదర్శకుడు బ్రహ్మకడలి నేతృత్వంలో ఓ సెట్‌ రూపొందించారు. ఇది బాలకృష్ణ నటిస్తున్న 99వ చిత్రం. అందుకే 99 మంది డాన్సర్లతో బాలకృష్ణ ఆడిపాడబోతున్నారు.

    బాలకృష్ణ, 99 డాన్సర్లు, దాదాపు రెండువేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్య ఈపాటని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలకృష్ణని శ్రీవాస్‌ సరికొత్తగా ఆవిష్కరించబోతున్నారని, ఆయన గెటప్‌ వినూత్నంగా ఉండబోతోందని, ఆయన పలికే సంభాషణలు ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచబోతున్నాయని చిత్ర దర్శకుడు చెప్తున్నారు.

     Balakrishna Dictator Introduction Song Shoot Started

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

    బాలకృష్ణ మాట్లాడుతూ ....కుటుంబ బంధాలు, యాక్షన్, వినోదం అన్ని సమపాళ్లలో మేళవించిన చిత్రమిది. కోన వెంకట్, గోపీమోహన్ చక్కటి కథను అందించారు. కొత్త టీమ్‌తో పనిచేయటం ఆనందంగా ఉంది .దర్శకుడు శ్రీవాస్ చెప్పిన కథలో కొత్తదనం ఉండడంతో చిత్రంలో నటించడానికి ఒప్పుకున్నానని, కోన వెంకట్, గోపీ మోహన్, రత్నం, శ్రీధర్ సీపానలు ఈ చిత్రంకోసం పనిచేస్తున్నారని, యాక్షన్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ లాంటి అన్ని ఎలిమెంట్స్‌తో ఈ చిత్రం రూపొందుతుందని తెలిపారు.

    ప్రేక్షకులు, అభిమానులు బాలకృష్ణను ఎలా చూడాలనుకుంటారో అలా ఈ చిత్రం రూపొందనుందని ఈరోస్ సునీల్‌లుల్లా తెలిపారు. యాక్షన్ ఎమోషనల్ డ్రామా అంశాలతో రూపొందే డిక్టేటర్ ప్రేక్షకులకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుందని, ఇప్పటివరకు బాలయ్యను చూడని విధంగా వైవిధ్యంగా ఈ చిత్రంలో చూపనున్నామని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు.

    అలాగే...శ్రీవాస్ మాట్లాడుతూ బాలకృష్ణను సరికొత్త పంథాలో ఆవిష్కరిస్తున్న చిత్రమిది. కథ, కథనాలు నవ్యరీతిలో సాగుతాయి. ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో పాటు సహనిర్మాతగా కొనసాగనుండటం సంతోషంగా ఉంది. మరో హీరోయిన్ త్వరలో ఎంపికచేస్తాం అని తెలిపారు.

    తమన్‌ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రంలో బ్రహ్మానందం, నాజర్‌, రవికిషన్‌, కబీర్‌, వెన్నెల కిషోర్‌, పృథ్వీ, కాశీవిశ్వనాథ్‌ తదితరులు నటిస్తున్నారు. అంజలి హీరోయిన్ గా నటించనున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ఎంపిక కావల్సి వుంది. నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు.

    ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

    English summary
    Balakrishna joined the introduction song shoot of Dictator under the choreography of Prem Rakshith master. As per the buzz, this intro-number was picturing on Lord Ganesha where as NBK was moving his legs by chanting Sri Ganesha. Well, previously thaman tweeted that he composed a song on Lord Ganapati.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X