»   »  ఎన్టీఆర్‌తో క్లాష్ లేదు: బరి నుండి తప్పుకుంటున్న బాలయ్య?

ఎన్టీఆర్‌తో క్లాష్ లేదు: బరి నుండి తప్పుకుంటున్న బాలయ్య?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా 'డిక్టేటర్' చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈరోస్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థతో కలిసి వేదాశ్వ క్రియేషన్స్ అసోసియేషన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీవాస్ దర్శకుడు. మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన శ్రీవాస్ ఈ చిత్రాన్ని బాలకృష్ణ అభిమానులు, ఇతర ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని ముందుగా భావించారు. అయితే ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశం లేదని అంటున్నారు. బాలయ్య పొలిటికల్ కమిట్మెంట్స్ మూలంగా సినిమా షూటింగ్ ఆలస్యంగా సాగుతోందని అంటున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తయ్యే సరికి సంక్రాంతి దాటిపోతోందని, ఫిబ్రవరిలోనే సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని టాక్.

సంక్రాంతి రేసులో బాలయ్య ‘డిక్టేటర్', జూ ఎన్టీఆర్ ‘నాన్నకు ప్రేమతో' పోటీ పడతాయని, ఇది అంత మంచి పరిణామం కాదని అంతా అనుకున్నారు. అయితే బాలయ్య డిక్టేటర్ లేటయ్యే అవకాశం ఉండటంతో..... శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ‘నాన్నకు ప్రేమతో' చిత్రం సంక్రాంతికి విడుదల కావడం ఖాయంగా కనిపిస్తోంది.

Balakrishna 'Dictator' Out of Pongal Race

డిక్టేటర్ లో బాలకృష్ణ సరసన అంజలి, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. కథానుసారం మరో నాయికకు కూడా స్థానం ఉంది. ఈ పాత్రకు అక్షను ఎంపిక చేశారు. 'రైడ్', 'కందిరీగ' వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్ష కెరీర్ కి మంచి బ్రేక్ ఇచ్చే విధంగా ఈ పాత్ర ఉంటుందని చిత్రబృందం తెలిపింది.

రవికిషన్, షాయాజీ షిండే, నాజర్, పృథ్వి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎస్.ఎస్.థమన్, డైరెక్టర్ ఆఫ్ సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయడు, డైలాగ్స్: ఎం.రత్నం, రచన: కోన వెంకట్, గోపీ మోహన్, రచనా సహకారం: శ్రీధర్ సీపాన, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి.

English summary
Film Nagar source said that, Balakrishna 'Dictator' Out of Pongal Race.
Please Wait while comments are loading...