»   »  తొలిసారిగా బాలయ్య లైవ్‌ చాట్: ఏం మాట్లాడారో చూడండి! (వీడియో)

తొలిసారిగా బాలయ్య లైవ్‌ చాట్: ఏం మాట్లాడారో చూడండి! (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారిగా లైవ్ చాట్‌లో పాల్గొన్నారు. అభిమానులతో ఇష్టాగొష్టిగా ముచ్చటించారు. పుట్టినరోజు సందర్భంగా తన తాజా సినిమా 'పైసా వసూల్' దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి చిట్ చాట్ చేశారు.

ఈ సందర్భంగా అభిమానులు బాలయ్యను పుట్టినరోజు శుభాకాంక్షలతో ముంచెత్తారు. తన గురించి ఫ్యాన్స్ పొగడ్తలు గుప్పించడంతో బాలయ్య మురిసిపోయారు. అభిమానుల కోరిక మేరకు కొన్ని డైలాగులు చెప్పి మెప్పించారు.


ఈ లైవ్ చాట్ వీడియోను ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మంది వీక్షించారు.


లైవ్ రికార్డరెడ్ వీడియో ఇదే...

గంభీరంగా ఉండే బాలయ్య గొంత కాస్త చిన్నబోయినట్లు కనిపించింది. వాతావరణంలో మార్పు, వర్షంలో తడవటం వల్ల బాలయ్య గొంతులో చిన్న తేడా వచ్చిందని, అందుకే ఆయన వాయిస్ చిన్నబోయిందని దర్శకుడు పూరి తెలిపారు.


పోర్చుగల్ నుండే

పోర్చుగల్ నుండే

ప్రస్తుతం బాలయ్య ‘పైసా వసూల్' మూవీ షూటింగులో భాగంగా పోర్చుగల్ లో ఉన్నారు. అక్కడి నుండే అభిమానులతో ముచ్చటించారు.


అభిమానులను మిస్సవుతున్నాను

అభిమానులను మిస్సవుతున్నాను

గత రెండేళ్లుగా పుట్టినరోజున అభిమానులకు దూరంగా ఉండాల్సి వస్తోంది. గత సంవత్సరం పాప గ్రాడ్యుయేషన్‌ డే కోసం స్టేట్స్‌లో ఉన్నా. ఇప్పుడు పోర్చుగల్‌లో ఉన్నా. మీ అందర్నీ చాలా మిస్‌ అవుతున్నా. ఎంత మిస్సైనా మీ అందరూ ఎదురుచూస్తున్న మా కాంబినేషన్‌ వస్తోందిగా అని బాలకృష్ణ అన్నారు.


పండగ చేసుకునే మూవీ

పండగ చేసుకునే మూవీ

‘‘పైసా వసూల్‌' టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. చాలా ఫోన్‌కాల్స్‌ వచ్చాయి. పాటలు బాగా వచ్చాయి. నెల రోజులుగా ఆ పనిమీదే ఉన్నాం. ఫ్యాన్స్‌ అందరూ పండగ చేసుకునే సినిమా వస్తుంది' అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు.


బాలయ్య పాడిన పాట హైలెట్

బాలయ్య పాడిన పాట హైలెట్

‘పైసా వసూల్' చిత్రం కోసం బాలయ్య ఒక పాట పాడారు. సినిమాకు ప్లస్‌ అవుతుంది. ఆయన పాడటం తొలిసారి. దాని చిత్రీకరణ కూడా పూర్తయింది. పోర్చుగీసు అమ్మాయిలు కూడా ఈ సినిమా పాట పెట్టుకుని డ్యాన్స్‌ చేస్తున్నారు అని పూరి చెప్పుకొచ్చారు.


మోక్షజ్ఞ త్వరలో

మోక్షజ్ఞ త్వరలో

మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తున్నాడు? అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు త్వరలో.... అన్ని వివరాలు వెల్లడిస్తాను అని బాలయ్య తెలిపారు.English summary
Nandamuri Balakrishna took part in a Facebook live chat on the eve of his birthday. Puri Jagannath planned this interactive session with fans when the unit was still shooting 'Paisa Vasool' in Portugal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu