»   » రవితేజ ‘వీర’ప్లాప్ టాక్ తో బాలయ్య ఫాన్స్ సంబరాలు...!?

రవితేజ ‘వీర’ప్లాప్ టాక్ తో బాలయ్య ఫాన్స్ సంబరాలు...!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రవితేజ సినిమాలన్నీ ఇంచు మించు ఒకే రకంగా ఉంటాయి. అతని యాక్టింగ్ ప్రేక్షకులు భరించారు కానీ ఇప్పుడు మాత్రం బోర్ ఫీలవుతారు. అసలు రవితేజ మంచి నటుడు కాదని, రొటీన్ మాస్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడని కూడా అంటున్నారు. ఒకవేళ డిఫరెంట్ గా ట్రై చేయబోతే నటుడిగా రవితేజ ప్లాప్ అవుతాడని కూడా తేల్చేశారు.

రవితేజ 'వీర" బాలకృష్ణ చేయ్యాల్సి ఉన్నది. వీర స్క్రిప్ట్ బాలకృష్ణ బాడీ ల్యాంగ్వేజ్ కి సూట్ అయ్యే విధంగా ప్రిపేర్ చేయబడింది. ఈ సినిమాకి టైటిల్ కూడా 'భీష్మ"గా కన్ఫం అయినది. అయితే బాలకృష్ణ తప్పుకోవడంతో ఆ ఛాన్స్ రవితేజ కొచ్చింది. అయితే కొద్ది మార్పులతో రవితేజతో వీరగా చిత్రీకరించారు. అయితే రవితేజ నటించి వీర ప్లాప్ టాక్ తెచ్చుకోవడంతో పలు విమర్శలకు దారితీసింది. అంతే కాకుండా బాలయ్య ఆ సినిమా మిస్ అయినందుకు బాలయ్య ఫ్యాన్స్ చాలా సంతోషంగా ఉన్నారు

రవితేజ పై ఇలాంటి విమర్శలు రావడానికి ముఖ్య కారణం రమేష్ వర్మ దర్శకత్వంలో 'వీర" ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో అతని నటన ప్రేక్షకులకు చిరాకు తెప్పించింది. ఇలా ఒకే మూసలో సాగితే రవితేజ కెరీర్ సాగడం కష్టం అని కూడా అంటున్నారు. కావున నటుడిగా డెవలప్ అయ్యి రవితేజ వేరే రూటులో వెల్లడం మంచిది..

English summary
Mass Raja Ravi Teja’s latest film ‘Veera’ which is very disappointing is supposed to be done by Balakrishna.The flop talk that the film is receiving now naturally makes Balakrishna fans feel very happy for their beloved hero luckily missing the film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu