‘అదుర్స్’నిర్మాతతో బాలకృష్ణ చిత్రం ఖరారు
ఇక ఈ 2012 సంవత్సరం బాలకృష్ణకు సినిమాల పరంగా కలిసి రాలేదని చెప్పాలి. ఆయన నటించిన మూడు చిత్రాలు ఈ సంవత్సరం విడుదలయ్యాయి కానీ ఏవీ భాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేకపోయాయి. మూడు పాత్రలతో ఎన్నో ఆశలు రేపుతూ వచ్చిన అధినాయకుడు, జర్నలిస్టుగా తొలిసారి బాలకృష్ణ చేసిన శ్రీమన్నారాయణ , బాలకృష్ణ కీ రోల్ లో చేసిన ఊ..కొడతారా ఉలిక్కిపడతారా డిజాస్టర్ లు అయ్యాయి.
దాంతో బాలకృష్ణ గత కొద్ది నెలలుగా ఏ కొత్త చిత్రం కమిటవకుండా కేవలం కథలు వింటూ ఉన్నారు. హీరోగా కెరీర్ ప్రారంభించిన నాటి నుంచి ఏనాడూ ఆయన ఖాళీగా లేరు. ఈ గ్యాప్ బాలయ్య తనకు తానుగా తీసుకున్నదేనని, ఈ సారి బ్లాక్ బస్టర్ హిట్ తో వస్తాడని అంటున్నారు.అలాగే ఇక నుంచి సెలక్టీవ్‌గా సినిమాలు చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్టు కూడా తెలిసింది.
ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టడానికి ఓ పక్క ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ.. మరో పక్క బసవతారకం కేన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు బాలయ్య. అయితే అభిమానులకు మాత్రం బాలకృష్ణ విరామం తీసుకోవడం మింగుడు పడటం లేదు. దాంతో వారిని ఉల్లాసపరచటానికి సామాజిక సందేశం తో కూడిన పొలిటికల్ చిత్రం వర్కవుట్ చేసినట్లు,బాలకృష్ణకు కథ బాగా నచ్చే చిత్రం ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో అయినా బాలకృష్ణ తిరిగి సింహాలాంటి హిట్ ఇస్తాడని ఆశిద్దాం.


Click it and Unblock the Notifications












