ఊ కొడతారా ఉలిక్కిపడతారా..బాలకృష్ణ గెటప్ చూడండి...!

By Sindhu

నందమూరి బాలకృష్ణ ఓ వైపు రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూనే... ప్రాముఖ్యమున్న చిత్రాల్లో... ముఖ్యపాత్రలు సైతం పోషిస్తున్నాడు. మంచు మనోజ్ హీరోగా రూపొందిస్తున్న ఊ కొడతారా ఉలిక్కిపడతారా చిత్రంలో నందమూరి బాలకృష్ణ కథలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాడు. ఆయన సరసన పాంచిబోరా హీరోయిన్ గా నటిస్తోంది.

మనోజ్, దీక్షాసేథ్ జంటగా మంచు ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శేఖర్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సమర్పణలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పటివరకు 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే రాజమండ్రికి సమీపంలోని అంతర్వేది దేవాలయంలో బాలకృష్ణ పాల్గొన్న దృశ్యాలను చిత్రీకరించారు. ఈ చిత్రం కోసం హైదరాబాద్ లో ఆరున్నర కోట్లు పెట్టి ఫ్లోర్ సెట్ ను రూపొందించడం జరిగింది.

డైరెక్టర్ దగ్గరుండి 9 నెలలు శ్రమించగా, సెట్ రూపకల్పనలో ప్రతి ఒక్కరూ కృషిచేశారు. పాటలు మినహా దాదాపు సినిమా మొత్తం ఈ సెట్లోనే షూటింగ్ జరుపుకుంటుందని నిర్మాత లక్ష్మీ ప్రసన్నవివరించారు. మనదేశంలో ఎక్కడా లేనంత కళంకారీ ఆ సెట్ తయారు చేయడంలో ఉపయోగించామని లక్ష్మీ చెప్పారు. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదలవుతుందని తెలిపారు. సోనూసూద్, ప్రభు ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X