»   » లేటెస్ట్ ఫోటో: చిన్న మనవడితో కలిసి బాలకృష్ణ అండ్ ఫ్యామిలీ!

లేటెస్ట్ ఫోటో: చిన్న మనవడితో కలిసి బాలకృష్ణ అండ్ ఫ్యామిలీ!

Posted By:
Subscribe to Filmibeat Telugu

నందమూరి బాలకృష్ణ మరో సారి తాతయ్య అయిన సంగతి తెలిసిందే. ఆయన రెండో కూతురు తేజస్విని ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. తాజాగా తన మనవడితో బాలయ్య ఫ్యామిలీ దిగిన ఫోటో ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ ఫోటోలో తేజస్విని, శ్రీ భరత్ దంపతులతో పాటు..... కావూరి కూడా ఉన్నారు.

తేజస్విని వివాహం గీతం యూనివర్శిటీ వ్యవస్థాపకులు ఎంవివిఎస్ మూర్తి మనవుడు శ్రీభరత్‌తో 2013లో జరిగిన సంగతి తెలిసిందే. అప్పట్లో బాలయ్య ఈ పెళ్లివేడుకను రాజకీయ, సినీ, పారిశ్రామిక ప్రముఖులను ఆహ్వానించి గ్రాండ్‌గా నిర్వహించారు. కుమారుడి రాకతో తేజస్విని దంపతులు ఆనందంలో మునిగి తేలుతున్నారు.

Balakrishna Grandson with mother Tejaswini and father Sri Bharat

ఇక బాలయ్య పెద్దకూతురు బ్రాహ్మణి వివాహం... ఏపీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌తో జరిగిన సంగతి తెలిసిందే. వీరికి దేవాన్షన్ అనే కుమారుడు ఉన్నాడు. దేవాన్ష్ 3వ పుట్టినరోజు వేడుక ఇటీవల గ్రాండ్‌గా జరిగింది.

English summary
Nandamuri Family in bliss mode. #Balakrishna Grandson with mother Tejaswini and father Sri Bharat along with grandfathers. Family latest picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X