»   »  బాలయ్య విజయానందం....

బాలయ్య విజయానందం....

Posted By:
Subscribe to Filmibeat Telugu
Pandurangadu
బాలకృష్ణ ద్విపాత్రలు పోషించిన 'పాండురంగడు' చిత్రానికి విడుదలై ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో విశేషాదరణ లభిస్తోంది. ఈ సందర్భంగా బాలకృష్ణ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. "అమెరికాలో వున్న అభిమానులంతా 'పాండురంగడు'ని చూసి బాగా ఆనందిస్తున్నారు. పండుగలు చేసుకుంటున్నారు. వారి అద్భుత స్పందన చూస్తుంటే నాకూ బాగా ఆనందమేస్తోంది. అమెరికాలో అభిమానులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొనడం ఒక చక్కని అనుభూతినిచ్చింది. మహానటులు నందమూరి తారక రామారావు కుమారుడిగా జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. ఆయన చేసిన 'పాండురంగడు'ను నేను చేయడం మరో అదృష్టం. 'పాండురంగడు'ను విశేషంగా ఆదిరిస్తున్న ప్రేక్షకులకు, ముఖ్యంగా నా అభిమానులకు కృతజ్ఞతలు" అని ఆయన చెప్పారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X