»   » నా మీసం నుంచి పుట్టుకొచ్చింది: బాలకృష్ణ

నా మీసం నుంచి పుట్టుకొచ్చింది: బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

కథ నుంచి కథానాయకుడు..కథానాయకుడి నుంచి కథ పుట్టడం మనకు తెలుసు. కానీ నా మీసం నుంచి పుట్టుకొచ్చిన కథ 'సింహా' అంటున్నారు బాలకృష్ణ. 'సింహా' సంచలన విజయం సాధించిన నేఫద్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే 'సింహా' లో నరసింహగా నన్ను చూసిన ప్రేక్షకులందరూ 'బాలకృష్ణ సినిమా అంటే ఇలా ఉండాల్రా' అనుకుంటున్నారని విన్నాను. నా సినిమా ఎలా ఉండాలో..నా సినిమాలో ఏం ఉండాలో 'సింహా' తెలియజేసింది. ఇందులో చేసిన రెండు పాత్రలూ ఇంతకు ముందు చేయని పాత్రలే. ముఖ్యంగా నరసింహ పాత్రకు మేకప్‌ లేకుండా చేశా. ఆ పాత్రకు అద్భుతమైన అప్లాజ్‌ వస్తోంది. నాన్నగారిని మదిలో పెట్టుకొని చేసిన పాత్ర ఇది. ఏది ఏమైనా ఇంతటి విజయానికి ప్రధాన కారకుడైన దర్శకుడు బోయపాటి శ్రీనుకు, చిత్ర యూనిట్‌సభ్యులకు, అభిమానులకు కృతజ్ఞతలు అని నందమూరి బాలకృష్ణ అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu