ఫ్యాన్స్ కు బాలకృష్ణ వివాహ ఆహ్వానం
ప్రముఖ సినీ నటుడు, టీడీపీ నేత నందమూరి బాలకృష్ణ రెండో కుమార్తె తేజస్విని వివాహం ఈ నెల 21న జరగనుంది. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి, కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు మనవడైన శ్రీభరత్‌తో తేజస్విని వివాహ నిశ్చితార్థం బాలయ్య ఇంట్లో ఆదివారం ఉదయం 11 గంటలకు జరగింది. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో ఈ నెల 21వ తేదీ ఉదయం 8:52 గంటలకు వివాహం జరపనున్నారు. ఆదివారం బాలకృష్ణ నివాసంలో వారి వివాహ నిశ్చితార్థం జరిగింది.
శ్రీభరత్ కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు సోదరి కుమారుడు, విశాఖపట్నం టీడీపీ నాయకుడు ఎంవీఎస్ మూర్తికి మనుమడు. ఈ సంబంధాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుదిర్చారు. బాలకృష్ణ పెద్ద కుమార్తె బ్రహ్మణికి, చంద్రబాబు కుమారుడు లోకేష్‌కు 2007 ఆగస్టులో వివాహం జరిగిన విషయం తెలిసిందే. కాగా.. ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి పలువురు సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరయ్యారు. ఢిల్లీలో ఉన్న హరికృష్ణ హాజరు కాలేదు. ఇక తేజస్విని కుటుంబంతో పాటు అటు వరుడు భరత్ కుటుంబం కూడా సామాజికంగా, రాజకీయంగా బాగా పలుకుబడి ఉన్న కుటుంబాలు కాబట్టి వీరి వివాహం అంగరంగ వైభవంగా జరుగనుంది.


Click it and Unblock the Notifications












