twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచి పని కోసం బాలయ్య‌- యువరాజ్ సింగ్ ఒక్కటై.. (ఫోటో)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి నటసింహం బాలకృష్ణ, క్రికెటర్ యువరాజ్ సింగ్ ఓ మంచి పని చేయడం కోసం ఒక్కటయ్యారు. ఈ మేరకు ఇద్దరూ కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ కలిసి క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు.

     Balakrishna joined hands Cricketer Yuvaraj

    హైదరాబాద్‌లో బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి ఛైర్మన్‌గా బాలకృష్ణ క్యాన్సర్‌ వ్యాధిపై అవగాహన కల్పించడంలో తన వంతు పాత్ర పోషిస్తున్నారు. క్రికెటర్ యువరాజ్ సింగ్ కూడా క్యాన్సర్ బారిన పడి ఆ వ్యాధిని జయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక్కటయ్యారు. అవకగాహన కల్పించడంతో పాటు, క్యాన్సర్ బాధితులకు చికిత్సలు చేయించేందుకు నిధుల సేకరణ కార్యక్రమాలు చేపట్టనున్నారు.

    యువరాజ్ సింగ్ యువీకెన్ (YOUWECAN) అనే ఆర్గనైజేషన్ ద్వారా కాన్సర్ బాధితులకు తన వంతు సాయం అందిస్తున్నాడు. క్యాన్సర్‌ బాధితులను ఆదుకోవడానికి యువరాజ్‌సింగ్‌ ఏర్పాటుచేసిన 'యూవీకెన్‌' సంస్థ, బాలయ్య చైర్మన్ గా కొనసాగుతున్న బసవతారకం ఆసుపత్రి ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ రెండు సంస్థలు కలిసి క్యాన్సర్ మహమ్మారిపై పోరాటం ఉధృతం చేయనున్నాయి.

    English summary
    Film star and Hindupur MLA, Nandamuri Balakrishna, joined hands with Indian cricket star, Yuvaraj Singh, to facilitate better medical aid and other support to cancer patients at the Basavatarakam Cancer Hospital. With this association, Yuvaraj's YouWeCan foundation will assist the Basavatarakam Cancer Hospital.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X