»   » బాలయ్య బాబు మళ్లీ నోరు జారాడు..ఇదే అంతటా (వీడియో)

బాలయ్య బాబు మళ్లీ నోరు జారాడు..ఇదే అంతటా (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఇప్పుడు ఎక్కడ విన్నా బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు గురించే.. చర్చ జరుగుతోంది. ఆ మధ్యన సావిత్రి సినిమా ఆడియో ఫంక్షన్‌లో ''అమ్మాయిల వెనకాల పడి కడుపు చేసేయ్యడమే లేదంటే ఫాన్స్ ఒప్పుకోరు ''అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు తెలంగాణా ప్రజలని ఉద్దేశించి చేసిన కామెంట్స్ వీడియో అంతటా సర్కులేట్ అవుతోంది.

తన 56వ పుట్టినరోజు వేడుకలను అమెరికాలో ఘనంగా జరుపుకున్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణకు సంబంధించి వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇప్పడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పుట్టినరోజు వేడుకల్లో భాగంగా మాట్లాడిన బాలకృష్ణ.. 'ఒకప్పుడు తెలంగాణ ప్రజానీకానికి అసలు తెల్లన్నం అంటే ఏంటో తెలియదు' అన్న తరహాలో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Balayya

ఈ వీడియోలో ఆ వ్యాఖ్యలను 7:35 వద్ద చూడవచ్చు.

ఎన్టీఆర్ గొప్పతనం గురించి చెబుతూ తెలంగాణ విషయాన్ని ప్రస్తావించిన బాలయ్య వివాదస్పద వ్యాఖ్యలకు తెరలేపారు. బాలయ్య మాట్లాడుతూ.. దేశంలో ఆహార భద్రతను 1983లోనే ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ దే అని చెప్పుకొచ్చారు ఆయన.

అలాగే 'తెలంగాణ విషయమైతేనేం.. అసలు తెల్ల అన్నమంటేనే తెలియని అక్కడివారికి, అయితేనేం.. నాలుగు వేళ్లు నోట్టోకి వెళ్లేలా చేసింది ఎన్టీఆర్' అని కామెంట్ చేశారు. కాగా, బాలయ్య తాజా వ్యాఖ్యలు తెలంగాణను కించపరిచేవిగా ఉండేవడంతో, ఈ విషయం కాస్త వివాదంగా మారే అవకాశాలు లేకపోలేదు

మరో ప్రక్క బాలకృష్ణ తన 100వ సినిమాను ఎంతో ప్రతిష్టాకంగా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం ఆయన చారిత్రక నేపథ్యం ఉన్న కథను ఎంచుకున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ చక్రవర్తి 'గౌతమిపుత్ర శాతకర్ణి' జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో చేస్తున్నారు.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయింది. మొరాకోలో తొలి షెడ్యూల్ లో రూ. 8 కోట్ల ఖర్చుతో భారీ యుద్ధ సన్నివేశం కూడా తెరకెక్కించారు. అయితే ఇప్పటికీ ఈ సినిమాకు హీరోయిన్ ఖరారు కాలేదు. అంతకు ముందు ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపించినా వారు ఫైనల్ కాలేదు.

తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఖరారైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు అఫీషియల్ గా ప్రకటించారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన హీరోయిన్ గా శ్రీయను ఎంపిక చేసినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ చిత్రంలో ఆమె మహారాణి పాత్రలో నటించబోతోంది. ఇటీవల మొరాకోలో తొలి షూటింగ్‌ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుని వచ్చినఈ చిత్రం ఇప్పుడు హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ దేవాలయం సమీపంలో రెండో షెడ్యూల్‌ను జరుపుకొంటోంది.

English summary
Nandamuri Balakrishna, the actor and Hindupur MLA, has attracted a controversy yet again, with his sensational speech. Talking about the dynamic steps NTR has taken, during his political journey, Balakrishna said that Telangana people had the white rice only because of the '2 Rs Kilo Rice' scheme introduced by the legend. He added that people started having handful of food after NTR became the Chief Minister.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu