»   » విషాదం: అందుకే బాలయ్య ‘లయన్’ రిలీజ్ వాయిదా!

విషాదం: అందుకే బాలయ్య ‘లయన్’ రిలీజ్ వాయిదా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నందమూరి నట సింహం బాలయ్య నటించిన ‘లయన్' మూవీ మే 1న విడుదల చేస్తున్నట్లు ఆ మధ్య ప్రకటించినా.....అనుకున్న సమయానికి సినిమాను విడుదల చేయలేక వాయిదా వేసారు. మే 8న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ చిత్రానికి పని చేస్తున్న ఆడియోగ్రాఫర్ మధుసూదనరెడ్డి మరణంతో ఆ పని అర్ధాంతరంగా ఆగిపోయింది. అందుకే విడుదల ఆలస్యం అయిందని అంటున్నారు.

ఆ మధ్య సినిమా బిజినెస్ పూర్తికాక పోవడం వల్లనే విడుదల వాయిదా పడిందనే వార్తలు వినిపించాయి. ఆ వార్తల ప్రకారం సత్యదేవా దర్శకత్వంలో తెరకెక్కి ఈ చిత్రాన్ని రూ. 20 నుండి 22 కోట్ల బడ్జెట్ రేంజిలో పూర్తి చేద్దామనుకున్నారట. కానీ సినిమా పూర్తయ్యే నాటికి బడ్జెట్ రూ. 35 కోట్లకు చేరుకుంది. దీంతో బడ్జెట్ కు తగిన విధంగా సినిమాను కూడా వివిధ ఏరియాల్లో ఎక్కువ రేటుకు అమ్మాలని నిర్ణయించారు. ధర ఎక్కువ కావడంలో పలు ఏరియాలకు సంబంధించి ఇంకా ఎవరూ సినిమాను కొనడానికి డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ముందుకు రాలేదని టాక్. ప్రస్తుతం అన్ని సమస్యలు సెట్టయ్యాయని, మే 8న సినిమా విడుదల ఖాయం అంటున్నారు.


Balakrishna LION Movie Latest Release Date

రుద్రపాటి ప్రేమలత నిర్మాణ సారథ్యంలో జివ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా సత్య దేవ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తొలిసారిగా బాలయ్యతో త్రిష జతకడుతుండగా...‘లెజెండ్' అనంతరం రాధిక ఆప్టే మరోమారు బాలకృష్ణ సరసన నటిస్తోంది.

English summary
Balakrishna's Lion Movie Release Date Confirmed for May 8.
Please Wait while comments are loading...