తనపై కుళ్లు జోకులు వేస్తున్న వెబ్ సైట్ పై బాలకృష్ణ కేసు

By Srikanya

ఈ మధ్య కాలంలో ఎవరి సెల్ ఫోన్లో చూసినా టాలీవుడ్ స్టార్ హీరోలు బాలకృష్ణ మీదనో లేదా జూ. ఎన్టీఆర్ మీదనో కుళ్లు జోకులు దర్శనమిస్తున్నాయి. సర్దార్జీ జోక్‌లను బాలకృష్ణకు అనువర్తించి ఈ కుళ్లు జోకులను రూపొందించి ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా అలాగే బాలకృష్ణపై ఇలాంటి జోక్‌లు వికృతమైన ఫోటోలను కూడా వెబ్‌సైట్‌లో పెట్టి మరీ డబ్బులు సంపాదిస్తున్నారు కొందరు ప్రభుద్ధులు.

బాలకృష్ణపై ఇలాంటి జోక్‌లు, వికృత చిత్రాలకు ప్రత్యేకంగా ఐ హేట్ బాలయ్య డాట్‌ కామ్ వెబ్‌సైట్ కూడా నడపబడుతోంది. ఈ వెబ్‌సైట్ విషయాన్ని తన అభిమానుల ద్వారా బాలకృష్ణ స్వయంగా సైబర్ క్రైం డీసీపీకి ఫిర్యాదు చేశారు. కాగా.. పోలీసులు ఈ ఎస్ఎంఎస్‌ల వెనక ఉన్న సూత్రధారులతో పాటు సదరు వెబ్‌సైట్ నిర్వాహకులను పట్టుకునేందుకు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. ఇకపోతే బాలకృష్ణ ప్రస్తుతం పరుచూరి మురళి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆయన త్రిపాత్రాభినయం చేస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X