twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పవర్ ఫుల్ డైలాగులతో వస్తున్న బాలకృష్ణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమాలంటేనే పవర్ ఫుల్ డైలాగులకు పెట్టింది పేరు. ఆయన అభిమానులు చాలా మంది బాలయ్య చెప్పే డైలాగుల కోసమే థియేటర్లకు వెళతారంటే...ఆయన డైలాగ్ డెలివరీకి ఉన్న డిమాండ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. త్వరలో బాలయ్య 'శ్రీమన్నారాయణ' చిత్రం ద్వారా ప్రేక్షకులను అలరించబోతున్నారు.

    ఇటీవల విడుదలైన ఈచిత్రం ట్రైలర్లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ పంచ్ డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. '' ఏ అడ్డాకైనా నేను రెడీ, కడప సెవెన్ రోడ్ సెంటర్ కి రానా, అనంతపురం సప్తగిరి సర్కిల్ కి రానా లేక పోతే కర్నూలు కొండారెడ్డి బురుజు ఓకేనా లేక విజయవాడ బెంజి సర్కిల్ ఓకేనా లేకపోతే కరీంనగర్ కాశ్మీరీగడ్డకు రానా...ఏబే బోల్ ! ఎక్కడికి వచ్చినా వో బనేగా షేర్ ఖాన్ కి అడ్డా..!'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగులు అదుర్స్ అంటున్నారు ఫ్యాన్స్

    ఆ డైలాగులు చూస్తుంటే మాస్ జనాన్ని దృష్టిలో పెట్టుకునే ఈచిత్రం రూపొందించినట్లు స్పష్టమవుతోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ జర్నలిస్టు పాత్రలో నటిస్తున్నారు. రవికుమార్ చావలి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన పార్వతి మెల్టన్, ఇషా చావ్లా నటిస్తున్నారు. ఆగస్టు 6న ఆడియో విడుదల చేసి, ఇదే నెల చివరి వారంలో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

    జయ్ కుమార్, సురేష్, వినోద్ కుమార్, కోట శ్రీనివాసరావు, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, ఆహుతి ప్రసాద్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎం.ఎస్. నారాయణ, రాజా రవీందర్, దువ్వాసి మోహన్, రావు రమేష్, నాగినీడు, సుప్రీత్, సుధ, సత్య కృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, సినిమాటోగ్రఫీ: టి. సురేందర్ రెడ్డి, సంగీతం: చక్రి, ఎడిటింగ్: గౌతం రాజు, ఆర్ట్: నాగేందర్, కో డైరెక్టర్: ఎస్. సురేష్ కుమార్, పబ్లిసిటీ డిజైనర్: రమేష్ వర్మ, కాస్ట్యూమ్స్: ప్రసాద్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: వి. చంద్రమోహన్, మేనేజర్స్: కమల్ మోహన్ రావు. నిర్మాత: పుప్పాల రమేష్, కథ-కథనం-దర్శకత్వం: రవికుమార్ చావలి.

    Balakrishna's movies always attract the masses who just love him for those he

    English summary
    
 Balakrishna's movies always attract the masses who just love him for those heavy-duty dialogues and Balayya is once again back in action with his typical dialogues in Srimannarayana. Film nagar circles were already awestruck by the mass-power and here goes the dialogue.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X