»   » నేను 'సింహా’ ని మాత్రమే కాదు ‘నందీశ్వరుడు’ కూడా: బాలకృష్ణ

నేను 'సింహా’ ని మాత్రమే కాదు ‘నందీశ్వరుడు’ కూడా: బాలకృష్ణ

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెల్లంకొండ సురేష్, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే సెన్సేషనల్. వీరిద్దరి కాంబినేషన్ లో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని ప్లాన్ చేశారు. అయితే ఇటీవల పూరి చెప్పినట్లు బాలయ్యకు స్టోరీ నచ్చకపోవడంతో ప్రస్తుతం ఆ ప్రాజెక్టు కాస్తా వాయిదా పడినట్టు సమాచారం. కాగా తాజాగా బాలయ్య, బెల్లంకొండ ఇద్దరూ మరో భారీ చిత్రాన్ని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ చిత్రానికి క్రియేటివ్ స్టోరీ రైటర్ చిన్ని కృష్ణ కథను అందించనున్నట్లు సమాచారం.

కాగా ఈ చిత్రానికి నందీశ్వరుడు అని టైటిల్ కూడా నిర్ణయించినట్టు వినికిడి. ఈ చిత్రానికి బి. గోపాల్ దర్శకత్వం వహిస్తారని అనుకుంటున్నారు. అయితే ఈ నందీశ్వరుడు ప్రాజెక్టు ఎన్నాళ్లు నుండినో పెండింగ్ లో ఉందనీ, బెల్లంకొండ చొరవతో తాజాగా దీనిపై చర్చ వచ్చినట్టు భోగట్టా. గతంలో చిన్నికృష్ణ నరసింహనాయుడు" చిత్రానికి కథను అందించారు. ఆ చిత్రం ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపద్యంలో చిన్నికృష్ణ అందిస్తున్న 'నందీశ్వరుడు" చిత్రాన్ని చేద్దామని బాలయ్య చెప్పినట్టు సమాచారం.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu