»   » బ్యాక్ టు బ్యాక్ బాలయ్య నందీశ్వరుడు...

బ్యాక్ టు బ్యాక్ బాలయ్య నందీశ్వరుడు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

'సింహా" ఘనవిజయం సాధించిన ఉత్సాహంలో వరుసగా సినిమాలు చేస్తున్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాపు దర్శకత్వంలో శ్రీరామరాజ్యంతో పాటు పరుచూరి మురళి దర్శకత్వంలో కూడా మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ నందమూరి నటసింహాం త్వరలో నటించనున్న మరో చిత్రం'నందీశ్వరుడు". బాలయ్య సంచలన విజయాల్లో ఒకటైన నరసింహానాయుడుతో పాటు మరో ప్లాప్ చిత్రం సీమసింహానికి కథను అందించిన చిన్నికృష్ణ కథను అందిస్తున్న ఈ చిత్రానికి బి గోపాల్ దర్శకుడు. ఇంతకు ముందు బాలయ్యతో సమరసింహారెడ్డి, నరసింహానాయుడు లాంటి సంచలనాత్మక చిత్రాలను తెరకెక్కించిన బి గోపాల్ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాలనే ఆలోచనలో వున్నారట. సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ నిర్మిస్తారని తెలిసింది. ఈ చిత్రంలో బాలకృష్ణ పాత్ర ఇప్పటి వరకు ఏ చిత్రంలో కనిపించని విధంగా పూర్తి వైవిద్యంగా పవర్ ఫుల్ గా ఉంటుందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

English summary
Now, new talk in industry and media circles is that balakrishna has zeroed upon the story of Chinni Krishna which is titled ‘Nandiswarudu.’ To be directed by B. Gopal, this was actually the story which Chinni Krishna is known to have prepared for himself to make his directorial debut with Balayya. As per the information from Film nagar sources, Bellamkonda Suresh committed balakrishna for a movie on his banner in the direction of B. Gopal.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu