»   » బాలయ్య చిలిపి చేష్టలు, అంజలిని గిల్లాడు (వీడియో హల్‌చల్)

బాలయ్య చిలిపి చేష్టలు, అంజలిని గిల్లాడు (వీడియో హల్‌చల్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాలయ్య త్వరలో ‘డిక్టేటర్' సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. శ్రీవాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన అంజలి హీరోయిన్. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య చిలిపిగా ప్రవర్తించాడు. ఏదో విషయం అడుగుతూ ఆమెను సరదాగా గిల్లాడు. ఇపుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. బాలయ్య ఎవరితో అయినా ఇట్టే కలిసి పోతాడు. వారితో సరదాగా ఉంటాడు. అందుకు ఈ వీడియోనే నిదర్శనం అని అంటున్నారు ఆయన సన్నిహితులు.

డిక్టేటర్ సినిమా విషయానికొస్తే..
బాలయ్య తన 99వ సినిమా ‘డిక్టేటర్' ఇటీవల హైదరాబాద్ లో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి లక్ష్యం, లౌక్యం ఫేం శ్రీవాస్ దర్శకత్వం వహించబోతున్నారు. ఇండియాలోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, బోయపాటి శ్రీను ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలయ్య, అంజలిపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి రాఘవేంద్రరావు కెమెరా స్విచాన్ చేయగా.... బోయపాటి శ్రీను క్లాప్ కొట్టి సినిమాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బి గోపాల్, సురేష్ బాబు, అంబిక కృష్ణ, సురేష్ బాబు, కోన వెంకట్, గోపీ మోహన్, సత్యదేవ్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, ఆర్.పి.పట్నాయక్, ధశరత్, జెమిని కిరణ్ తదితరులు హాజరయ్యారు.

Balakrishna naughty act with Anjali!

నందమూరి బాలకృష్ణ, అంజలి, నాజర్, బ్రహ్మానందం, రవి కిషన్, కబీర్, వెన్నెల కిషోర్, పృథ్వి, కాశీ విశ్వనాథ్, ఆనంద్, సుప్రీత్ అమిత్ తదితరులు నటిస్తున్నారు. ప్రొడ్యూసర్: ఏరోస్ ఇంటర్నేషనల్, కోప్రొడ్యూసర్: వేదాశ్వ క్రియేషన్స్, డైరెక్టర్: శ్రీవాస్, కథ-స్క్రీన్ ప్లే: కోన వెంకట్, గోపీ మోహన్, మాటలు: ఎం. రత్నం, రచన: శ్రీధర్ సీపాన, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె. నాయుడు, మ్యూజిక్: థమన్, ఎడిటర్: గౌతం రాజు, ఆర్ట్: బ్రహ్మకడలి, ఫైట్స్: రవివర్మ, స్టిల్స్: అన్బు, పి.ఆర్.ఓ: వంశీ శేఖర్.

English summary
Nandamuri Balakrishna and Anjali has developed a great rapport even before they began shooting together. Here's the video of Balakrishna's naughty act with Anjali.
Please Wait while comments are loading...