For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పోలీస్‌స్టేషన్‌లో బాలకృష్ణ

  By Srikanya
  |

  హైదరాబాద్ : 'లెజెండ్‌'తో బాక్సాఫీసు దగ్గర తన సత్తా చూపించిన నందమూరి బాలకృష్ణ.... 2014లో తెలుగు చిత్రసీమకు ఓ చక్కటి విజయాన్ని అందించారు. అదే ఉత్సాహంతో 'లయన్‌'గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలకృష్ణ హీరోగా నటిస్తున్న చిత్రం 'లయన్‌'. ప్రస్తుతం హైదరాబాద్‌ శివార్లలో షూటింగ్ సాగుతోంది. ఈ చిత్రం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఓ పోలీస్‌ స్టేషన్‌ సెట్లో బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే, జయసుధ, చలపతిరావు తదితరులపై ఓ కీలక సన్నివేశం తెరకెక్కిస్తున్నారు.

  ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

  సోమవారం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ జరుగుతుంది. ఏప్రిల్‌లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారు. ''ఇటీవల విడుదల చేసిన 'లయన్‌' టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా అంతకు మించి ఉంటుంది. మణిశర్మ అందించిన గీతాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి'' అని దర్సక,నిర్మాతలు తెలిపారు. త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. సత్యదేవా దర్శకత్వం వహిస్తున్నారు. రుద్రపాటి రమణారావు నిర్మాత.

  Balakrishna new film shooting at Police station set

  బాలయ్య 'లయన్' చిత్రం ద్వారా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'లెజెండ్' లాంటి భారీ విజయం తర్వాత వస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. 'లయన్' చిత్రంలో కూడా బాలయ్య యాక్షన్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకోబోతున్నాడు. సత్యదేవ్ దర్శకునిగా పరిచయమవుతోన్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్నారు.

  కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సినిమా టీజర్‌ని బుధవారం రాత్రి 11 గంటల 15 నిమిషాలకు విడుదల చేశారు. ఇందులో త్రిష, రాధికా ఆప్టే హీరోయిన్స్. బాలయ్య 'కొందరు కొడితే ఎక్సరేలో కనపడుతుంది. మరికొందరుకొడితే స్కానింగ్ లో కనపడుతుంది. అదే నేను కొడితే హిస్టరీలో వినపడుతుంది.' అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి.

  నిర్మాత మాట్లాడుతూ.. '''లెజెండ్' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలకృష్ణ మా సినిమా చేయడం ఆనందంగా ఉంది. బాలయ్య ఇమేజ్‌కి తగ్గట్టుగా శక్తిమంతమైన కథను సత్యదేవ్ సిద్ధం చేశారు. ఈ చిత్రంతో తను అగ్ర దర్శకుల జాబితాలో చేరడం ఖాయం. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో భారీ నిర్మాణ విలువలతో మేం నిర్మిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ తారాగణం నటిస్తున్నారు.'' అని చెప్పారు.

  'లెజెండ్' తర్వాత బాలకృష్ణ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉండటం సహజం. అందుకు తగ్గట్టుగానే అత్యంత శక్తిమంతంగా ఇందులోని బాలయ్య పాత్ర ఉండబోతోందని వినికిడి. సత్యదేవ్ సంభాషణలు కూడా ఈ సినిమాకు హైలైట్‌గా నిలువనున్నాయని సమాచారం. గన్ నుంచి విడుదలయ్యే బుల్లెట్‌కి దయా దాక్షిణ్యాలుండవ్. దానికి తెలిసిందల్లా లక్ష్యం ఒక్కటే. దాన్ని ఛేదించేదాకా అది వదలదు. ఈ లక్షణాలతో ఓ పాత్రను సృష్టిస్తే? ఆ పాత్రను బాలకృష్ణ పోషిస్తే? ఇక అభిమానులకు అంతకంటే కావల్సిందేముంటుంది! సత్యదేవ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రంలో బాలకృష్ణ అలాగే కనిపించనున్నారని చెప్తున్నారు.

  బాలయ్య సరసన తొలిసారి త్రిష ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎస్.ఎల్.వి.సినిమా పతాకంపై రుద్రపాటి రమణరావు నిర్మిస్తున్నారు. చంద్రమోహన్, జయసుధ, ప్రకాశ్‌రాజ్, అలీ, గీత తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: వెంకట్‌ప్రసాద్, సంగీతం: మణిశర్మ, కూర్పు: గౌతంరాజు, సమర్పణ: రుద్రపాటి ప్రేమలత.

  English summary
  Balakrishna's new movie has been titled LION and the movie will be releasing on March 28. Balakrishna is close to his 100th film and the actor is keen on completing this mark at the earliest.In his 98th film LION Balakrishna will appear in a powerful role with some negative shades .The film is touted to be an intense suspense thriller.A new director Sathyadev will make his debut with this film and actress Trisha is the female lead.LION would be Trishas first movie with Balayya.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X