Just In
Don't Miss!
- News
విమానంలో టాయిలెట్‌కు వెళ్లనివ్వలేదని... డీజీసీఏ ఉద్యోగులను కిడ్నాప్ చేసిన యువకుడు...
- Sports
సెంచరీ చేశాక సెలబ్రేట్ చేసుకోను.. ఎగిరి గంతులేయకుండా..: లబుషేన్
- Finance
30 లోన్ యాప్స్‌కు గూగుల్ షాక్, ప్లేస్టోర్ నుండి తొలగింపు
- Lifestyle
సినిమా థియేటర్ కు వెళ్దామనుకుంటున్నారా? అయితే ఈ విషయాలు మీకోసమే...
- Automobiles
రైలులో హ్యుందాయ్ రయ్.. రయ్.. ఇదే తొలిసారి
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వావ్...! బాలయ్య న్యూలుక్ కేక పుట్టిస్తోంది : గౌతమీపుత్ర స్టిల్స్ చూస్తే షాక్ తింటారంతే
గౌతమీ పుత్ర శాతకర్ణి శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి టీవీ చానల్స్ వారు పోటీపడ్డారు. దాంతో భారీ మొత్తం .. అంటే, 9 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను 'మా టీవీ'వారు దక్కించుకున్నారు. శాటిలైట్ రైట్స్ పేరుతో 'లెజెండ్' సినిమా 7.5 కోట్లు రాబడితే, 'శాతకర్ణి' 9 కోట్లు వసూలు చేశాడు. బాలకృష్ణ కెరియర్లోనే ఇది రికార్డు స్థాయి రేటు అని చెప్పుకుంటున్నారు. బాలకృష్ణ భార్యగా ఈ సినిమాలో శ్రియ నటిస్తోన్న సంగతి తెలిసిందే.
డైరెక్టర్ క్రిష్ పెళ్ళికోసం కొన్ని రోజులు "గౌతమీ పుత్ర శాతకర్ణి" కి కొన్ని రోజుల విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక అన్ని పనులూ పూర్తవ్వటం తో మళ్ళీ సినిమా పై కి దృష్టి మళ్ళించారు. యుద్దం ఏపిసోడ్ అంతా పూర్తయి పోవటం తో ఇక బాలయ్య గౌతమీ పుత్రుడిగా ఉండే సన్ని వేశాల చిత్రీకరణ సాగుతోంది. ఈ సారి బాలయ్య గెటప్ అదిరిపోయింది. ఒకప్పుడు శ్రీకృష్ణ దేవరాయలు గా కనిపించి మురిపించిన ఈ నందమూరి అందాల నటుడు ఇప్పుడు గౌతమీ పుత్ర శాతకర్ణి గా రాజసాన్ని చూపిస్తూ సిమ్హం లా కనిపిస్తున్నాడు ఒకసారి ఆ స్టిల్స్ చూడండి

గౌతమీపుత్ర శాతకర్ణి
క్రిష్ దర్శకత్వంలో 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం తెరకెక్కుతోంది అన్న సంగతి తెలిసిందే మొరాకో .. జార్జియా .. హైదరాబాద్ లలో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తాజా షెడ్యూల్
క్రిష్ వివాహం సందర్భంగా ఈ సినిమా షూటింగుకి కొంతకాలం పాటు విరామాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తాజా షెడ్యూల్ కి మధ్యప్రదేశ్ లో రంగాన్ని సిద్ధం చేశారు. ఈ రోజు నుంచి ఈ సినిమా షూటింగ్ అక్కడ జరగనుంది.

తల్లిపాత్రలో హేమమాలిని
ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను అక్కడ చిత్రీకరించనున్నారు. బాలకృష్ణ తల్లిపాత్రలో హేమమాలిని .. భార్య పాత్రలో శ్రియ కనిపించనున్నారు.

ఆసక్తి పెరుగుతోంది
బాలకృష్ణ 100వ సినిమాగా చారిత్రక నేపథ్యంతో రూపొందుతోన్న ఈ సినిమాపై, అభిమానులందరిలోను ఆసక్తి పెరుగుతోంది.

భిన్నంగా కనిపిస్తున్నాడు
'గౌతమీపుత్ర శాతకర్ణి' కొత్త షెడ్యూల్‌కు సంబంధించి నెట్లో హల్ చల్ చేస్తున్న ఫొటోల్లో బాలయ్య చాలా భిన్నంగా కనిపిస్తున్నాడు. నెత్తిన చిత్రమైన టోపీ పెట్టుకుని.. భారీ వస్త్రాలంకరణతో నడిచొస్తున్నాడు బాలయ్య .

గెటప్స్ ఆకర్షణీయంగా ఉన్నాయి
వెనుక శ్రియ.. హేమమాలిని కూడా కనిపిస్తున్నారు. ఇందులో హేమమాలిని బాలయ్య తల్లిగా నటిస్తుంటే.. శ్రియ భార్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. వాళ్లిద్దరి గెటప్స్ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. తాజా షెడ్యూల్లో నది నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు తీస్తున్నాడు క్రిష్.

సంక్రాంతికి రిలీజ్
ఇప్పటికే 60 శాతం దాకా షూటింగ్ పూర్తి చేసిన క్రిష్.. రాబోయే రెండు నెలల్లో టాకీ పార్ట్ మొత్తం ఫినిష్ చేయాలని చూస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి పక్కాగా ఈ సినిమాను రిలీజ్ చేయాలన్నది దర్శక నిర్మాత క్రిష్ ప్లాన్.

యాక్షన్ పార్ట్ అయిపోయింది
ఇప్పటికే సినిమాకు సంబంధించి అత్యంత శ్రమతో కూడుకున్న యుద్ధ సన్నివేశాలు.. యాక్షన్ పార్ట్ అంతా అయిపోయింది. బాలయ్యకిది వందో సినిమా. దాదాపు రూ.70 కోట్ల బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

చిరంతన్ భట్
ఇక పని వత్తిడి కారణంగా ఈ సినిమా నుంచి దేవిశ్రీ ప్రసాద్ తప్పుకున్నాడు. దాంతో క్రిష్ 'కంచె' సినిమాకి సంగీతాన్ని అందించిన 'చిరంతన్ భట్'నే ఎంపిక చేసుకున్నాడు.

శాటిలైట్ రైట్స్ కి భారీ డిమాండ్
ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి కూడా భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను సొంతం చేసుకోవడానికి టీవీ చానల్స్ వారు పోటీపడ్డారు. దాంతో భారీ మొత్తం .. అంటే, 9 కోట్లు చెల్లించి శాటిలైట్ రైట్స్ ను 'మా టీవీ'వారు దక్కించుకున్నారు.

కెరియర్లోనే ఇది రికార్డు స్థాయి
శాటిలైట్ రైట్స్ పేరుతో 'లెజెండ్' సినిమా 7.5 కోట్లు రాబడితే, 'శాతకర్ణి' 9 కోట్లు వసూలు చేశాడు. బాలకృష్ణ కెరియర్లోనే ఇది రికార్డు స్థాయి రేటు అని చెప్పుకుంటున్నారు.