twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ కు కొత్త అర్దం చెప్పిన బాలకృష్ణ

    By Srikanya
    |

    నందమూరి బాలకృష్ణకు ఆయన తండ్రి ఎన్టీఆర్ అంటే విపరీతమైన ప్రేమ, అభిమానం. ఆయన తాజాగా ఆయన తండ్రి పేరైన ఎన్టీఆర్(NTR) కు కొత్త అర్దం చెప్పారు. ఆయన మాటల్లో...ఎన్ అంటే నటనాలయం...టి అంటే తారా మండలంలో ధృవతార, ఆర్ అంటే రమనీయుడు. ఈ మాటలు నందమూరి అబిమానుల్లో ఆనందాన్ని నింపాయి. ఇక ప్రస్తుతం బాలకృష్ణ వచ్చే ఎలక్షన్స్ లో పోటీ చేయటానికి ప్రిపేర్ అవుతున్నాడు. అలాగే ఆయన హీరోగా రాజకీయాలు ప్రధానాంశంగా రూపొందించిన అధినాయకుడు చిత్రం శివరాత్రికి విడుదల అవుతోంది. ఈ చిత్రంలో ఆయన త్రి పాత్రాభినయం చేసారు.

    బాలకృష్ణ,పరుచూరి మురళి కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం అధినాయకుడు. 'అధినాయకుడు' చిత్రాన్ని కీర్తి కంబైన్స్‌ పతాకంపై ఎమ్మెల్‌ కుమార్‌ చౌదరి నిర్మిస్తు న్నారు. ఈ చిత్రంలో లక్ష్మీరాయ్‌, చార్మి, సలోని హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణి మాలిక్‌ కంపోజ్‌ చేసిన అన్ని పాటలు చాలా అద్భుతంగా వచ్చా యని అంటున్నారు. నవంబర్‌లో ఈ చిత్రం ఆడియో విడుదల కాబోతుందని వినికిడి. శ్రీరామ రాజ్యం వంటి భక్తి రసాత్మక చిత్రం తర్వాత ఔట్‌ అండ్‌ ఔట్‌ కమర్షియల్‌ మూవీగా 'అధినాయకుడు' రాబోతోంది.

    దర్శకుడు పరుచూరి మురళి ఈ చిత్రం గురించి మాట్లాడుతూ ..“ ప్రజలకు సేవ చేసే నిజమైన నేత, వారి కష్ట సుఖాలలో పాలు పంచుకునే నేత ఎలా ఉండాలో అధినాయకుడు చూపిస్తుందని చెప్పిన మాటలు కూడా మరింత ఆసక్తి పెంచుతున్నాయి. ఈ సినిమాలో సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ విశేషాలు కూడా కలగలిసి ఉండవచ్చని పిల్మ్ నగర్ టాక్. ఇక ఈ సినిమాలో బాలయ్య సరసన హీరోయిన్లుగా సలోని, లక్ష్మి రాయ్ నటిస్తున్నారు.గతంలో చెన్నవకేశవరెడ్డి, ఒక్క మగాడు చిత్రాల్లో ఓల్డేజ్ గెటప్ లో కనిపించిన బాలయ్య అధినాయకుడులో మరోసారి ఆ క్యారెక్టర్ చేస్తున్నారు.

    English summary
    Balakrishna has given new meaning for NTR-N for Natanalayam- T for Tara Mandalam lo Dhruvatara and R for Ramaneeyudu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X