»   » బాలయ్య ‘గాడ్సే’గా మారితే రాజకీయంగా నష్టమే?

బాలయ్య ‘గాడ్సే’గా మారితే రాజకీయంగా నష్టమే?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'లెజెండ్' సినిమాతో బాక్సాఫీసును షేక్ చేసిన నందమూరి నట సింహం బాలయ్య తర్వాతి చిత్రం చర్చనీయాంశం అయింది. సత్యదేవ దర్వకత్వంలో తెరకెక్కుతున్న ఈచిత్రానికి 'గాడ్సే' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆర్.రమణరావు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు.

బాలయ్య సరసన ఈచిత్రంలో శ్రీయ, అంజలి హీరోయిన్లుగా నటించబోతున్నారు. జూన్ 10వ తేదీని ఈచిత్రాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బాలయ్య ఇమేజ్‌కు తగిన విధంగా ఈ సినిమా ఉండబోతోంది. అయితే ఈ చిత్రానికి 'గాడ్సే' టైటిల్ పరిశీలిస్తుండటం హాట్ టాపిక్‌గా మారింది.

Balakrishna new movie title ‘Godse’

జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన 'గాడ్సే' పేరును బాలయ్య సినిమాకు పరిశీలిస్తుండటం అభిమానులను కలవర పెడుతోంది. ప్రస్తుతం రాజకీయంగా ఎదుగుతున్న బాలయ్యకు ఇలాంటి నెగెటివ్ టైటిల్ సూటు కాదని, దీని వల్ల ఆయన రాజకీయంగా నష్టం జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు.

సాధారణంగా బాలయ్య కథ గురించి తప్ప ఇతర అంశాల గురించి పెద్దగా పట్టించుకోరు. అన్నీ దర్శక నిర్మాతల ఇష్టానికే వదిలేస్తారు. మరి 'గాడ్సే' టైటిల్ విషయంలోనూ బాలయ్య అలాగే ప్రవర్తిస్తారా? లేక అభిమానుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఈ టైటిల్ తిరస్కరిస్తారా? అనేది వేచి చూడాల్సిందే.

English summary
After “Legend” Nandamuri Balakrishna is getting ready to act in the direction of debutant director Satya Deva. This film is likely to launch on June 10 as Balayya’s birthday falling on the same day. As per the sources, this movie titled as ‘Godse’.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu