twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఒక్క ఫోన్ కాల్‌తో నా హీరోయిన్లు ఒప్పుకుంటారు: బాలకృష్ణ

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నందమూరి బాలకృష్ణ తన సహ నటీనటులు, దర్శక నిర్మాతలు, టెక్నీషియన్లకు ఎంతో గౌరవ ఇస్తారనే పేరుంది. తాజాగా ఆయన డిక్టేటర్ ఇంటర్వ్యూలో ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. నా షూటింగ్‌ విషయంలో, నా క్రమశిక్షణ, నా ఆర్టిస్టులకి మర్యాద ఇవ్వడం లాంటివి నాన్నగారి నుంచి నాకు వచ్చిన గుణాలు. ఈ విషయాల్లో నియంతలాగా ఉంటాను అన్నారు.

    నా ప్రతి సినిమాలో హీరోయిన్లకు మంచి పేరు వస్తుంది. ‘శ్రీరామరాజ్యం'లో నయనతార లేకపోతే సినిమానే లేదని బాహాటంగానే చెప్పా. నేను ఒక్క ఫోన చేస్తే చాలు... మా బాలా ఫోన చేశారని నా హీరోయిన్లు నా మీద నమ్మకంతో సినిమాలు ఒప్పుకుంటారు అని బాలయ్య ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

    తెలుగమ్మాయిలు పరిశ్రమలో ఒక్కశాతం కూడా లేరన్న తరుణంలో ఒక సావిత్రిగారిలాగా చేసింది అంజలి. ఈ సినిమా ఆ అమ్మాయికి ఇంకో మంచి మలుపు అవుతుంది. అంజలి నాలాగే గలగలా మాట్లాడుతూ ఉంటుంది. చాలా ప్రొఫెషనల్‌. చెప్పినవి చాలా తొందరగా గ్రాస్ప్‌ చేస్తుంది. చెప్పినదాన్ని చక్కగా ప్రొడ్యూస్‌ చేయగలుగుతుంది' అన్నారు బాలయ్య.

    Balakrishna New Year Special Interview About Dictator Movie

    సినిమా గురించి చెబుతూ...డిక్టేటర్‌కి కథే కీలకం. ఆ కథలో ఉన్న పాత్రని బట్టి ఈ టైటిల్‌ని పెట్టారు. అది కాకతాళీయమో ఏమోగానీ నా సినిమాలకు చాలా వరకు ఇంగ్లిష్‌ టైటిల్స్‌ ఉంటాయి. డిక్టేటర్‌ అంటే ఒక నియంత. తను అనుకున్నదే జరగాలి అని అనుకునే వ్యక్తి. సినిమాలో కూడా నా పాత్ర అలాంటిదే అన్నారు.

    జనరల్‌గా మా డైరక్టర్స్‌ కథకన్నా ముందు నా మేనరిజమ్స్‌, నాలోని ఆవేశం చూసి అందులో నుంచి ఓ పాయింట్‌ని పట్టుకుని దాని చుట్టూ కథను తయారుచేస్తారు. నిజ జీవితంలో నేను వాడే ఆంగికాన్ని వాళ్ళు సినిమాలోనూ పెడుతుంటారు అన్నారు. ఈ టైటిల్ ఎందకు పెట్టారని ఎప్పుడూ అడగలేదు. ఈ టైటిల్‌ వినగానే టెన్షనగానే అనిపించింది. షూటింగ్‌ అయిన తర్వాత డబ్బింగ్‌ చెబుతున్నప్పుడు చూస్తే, టైటిల్‌కి రీచ అయింది సినిమా అని అనిపించింది. డిఫరెంట్‌ బ్యాక్‌డ్రాప్‌ ఉన్న సినిమా. ఆర్థిక వ్యవస్థను మనిషి ఎలా శాసిస్తున్నాడు అనేది ఇందులో చెప్పామని తెలిపారు.

    English summary
    Watch Balakrishna New Year Special Interview About Dictator Movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X