»   » బాలకృష్ణ నెక్ట్స్ ఎవరి డైరక్షన్ లో నంటే..

బాలకృష్ణ నెక్ట్స్ ఎవరి డైరక్షన్ లో నంటే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలకృష్ణ సింహా చిత్రం అనంతరం లక్ష్యం శ్రీవాసు దర్శకత్వంలో చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సింహా రిలీజ్ అయిన వెంటనే ఈ చిత్రానికి సంభందించిన ప్రకటన వెలుబడుతుందని తెలుస్తోంది. ఇక లక్ష్యం వాసు ఇప్పుడు రామ రామ కృష్ణ కృష్ణ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రామ్ హీరోగా యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇక ఓ పాటలో కొద్ది భాగం మినహా 'సింహా' షూటింగ్ పూర్తయింది. మిగతా పనులన్నీ పూర్తిచేసి ఈ నెల(ఏప్రియల్) 30న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత పరుచూరి కిరీటి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే బాలకృష్ణ నుంచి ఆయన అభిమానులు ఎలాంటి చిత్రం ఆశిస్తున్నారో అలాంటి చిత్రమే 'సింహా' అని దర్శకుడు బోయపాటి శ్రీను చెప్తున్నారు. ఇటీవలే విడుదల అయిన పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన నయనతార, నమిత, స్నేహా వుల్లాల్‌ హీరోయిన్స్ గా చేస్తున్నారు. మిత్రుడు అనంతరం బాలకృష్ణ చేస్తున్న చిత్రం ఇదే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu