»   » సింగం దర్శకుడికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!

సింగం దర్శకుడికి బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: 'సింహా' చిత్రం విజయంతో నందమూరి నటసింహంగా పేరు తెచ్చుకున్న బాలకృష్ణ త్వరలో తమిళ దర్శకుడు హరి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. తమిళంలో సింగం, సింగం2 చిత్రాలతో భారీ విజయాలు నమోదు చేసిన హరికి పవర్ ఫుల్ దర్శకుడిగా పేరుంది.

ఇటీవలే హరి బాలయ్యకు స్టోరీ చెప్పారని, పాజిటివ్‌గా స్పందించిన బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. స్క్రిప్టు ఫైనల్ అయిన తర్వాత ఈ విషయాన్ని అఫీషియల్‌గా వెల్లడించనున్నారు. ఈ చిత్రాన్ని నిర్మాత సాయి కొర్రపాటి 'వారాహి చలన చిత్రం' బేనర్‌పై తెరకెక్కించబోతున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో 'లెజెండ్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం విశాఖ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటో ఒకటి లీకైంది. రూ. 20 లక్షల ఖర్చుతో ప్రత్యేకంగా డిజైన్ చేయించిన హార్లే డేవిడ్సన్ బైకు బాలయ్య ఆ ఫోటోలో దర్శనమిచ్చారు. ఈ ఫోటోలో బాలయ్య లుక్ చూస్తుంటే....దర్శకుడు బోయపాటి ఆయన్ను 'సింహా' రేంజిలో సినిమాలో చూపించబోతున్నారని తెలుస్తోంది.

వారాహి చలన చిత్రం సమర్పణలో 14 రీల్స్ ఎంటర్టెన్మెంట్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. బాలయ్య సరసన రాధికా ఆప్టే, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతి బాబు విలన్ పాత్రలో కనిపిస్తారు. పూర్తి కమర్షియల్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టెనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేసారు దర్శకుడు బోయపాటి శ్రీను.

English summary
Balakrishna next with Singam Hari. Hari recently narrated the script to Balayya and reportedly got his nod. Sai Korrapati who is the co-producer of Balayya’s Legend will be producing the movie on his Varahi Chalana Chitram banner.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu