»   »  బాబయ్యతో అబ్బాయ్ (కళ్యాణ్ రామ్) సినిమా

బాబయ్యతో అబ్బాయ్ (కళ్యాణ్ రామ్) సినిమా

Posted By:
Subscribe to Filmibeat Telugu
Balakrishna
నందమూరి కళ్యాణ్ రామ్ తన తాతగారి పేరు మీద యన్టీఆర్ ఆర్ట్ బ్యానర్ స్ధాపించి 'అతనొక్కడే' అనే బ్లాక్ బస్టర్ ఫిలిం తీసాడు. అలాగే 'హరేరామ్' అనే సినిమా పూర్తి చేసి శుక్రవారం రిలీజ్ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా తన బ్యానర్ పై బాబాయ్ బాలకృష్ణ తో తన తదుపరి చిత్రాన్ని నిప్మించటానికి ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. పాండురంగడు సినిమాకి కథ ఇచ్చిన భారవే దీనికీ కథ అందివ్వనున్నారని తెలుస్తోంది.

ఆ సినిమా షూటింగ్ సమయంలో మహాభారతం ఆధారంగా ఓ సోషల్ ఎలెమెంట్ ని ఇమిడ్చి కథ చేసి వినిపించాడని ,అది బాలయ్యకి బాగా నచ్చే ఇప్పటివరకూ ఏ దర్శకుడుకూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదంటున్నారు. భారవిని కథ పూర్తిగా వండి, పూర్తి స్క్రిప్టుతో కలవమన్నాడని గుసగుసలు వినపడుతున్నాయి. అదే నిజమైతే బాబాయ్ చిత్రాన్ని అబ్బాయ్ నిర్మించటం చరిత్రే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X