»   » బాలయ్య బాబు పరమవీర చక్ర సినిమా విడుదలకు అన్ని ధియేటర్లా..

బాలయ్య బాబు పరమవీర చక్ర సినిమా విడుదలకు అన్ని ధియేటర్లా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం బాలయ్య బాబు పరమవీర చక్ర గురించే మాట్లాడుకోంటోంది. దానికి కారణం నందమూరి బాలకృష్ణ హీరోగా డా. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపోందుతున్న 150వ చిత్రం కావడమే. ఇటీవల కాలంలో ఈసినిమా నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ ఈచిత్రం కోసం రామోజీ ఫిలిం సిటీలో కోటి 30లక్షల రూపాయలు వెచ్చంచి అతి భారీ సెట్ నురూపోందించడం జరిగిందని తెలిపారు. ఈసినిమా చివరిఘట్టాలను ఈభారీ సెట్ లోచిత్రీకరించడం జరుగుతుందని అన్నారు. ఇక ఈసినిమాలో హీరోహీరోయిన్లుగా అమీషా పటేల్, షీలా మరియు నేహా ధూపియాలు ఆడిపాడనున్నారు. డిసెంబర్ 10నుండి ఈసినిమాకు సంబంధించినటువంటి పాటలను స్విడ్జర్లాండ్ లోచిత్రీకరణ సాగుతుందని తెలిపారు.

ఇక ఈసినిమాలో బాలయ్య బాబు సైనికాధికారిగా, సినీనటుడిగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. గతంలో ఎన్టీఆర్ తోసర్దార్ పాపారాయుడు మరియు బోబ్బిలి సింహాం లాంటి సినిమాలను తెరకెక్కించినటువంటి దాసరి బాలయ్య బాబుతో సూపర్ డూపర్ హిట్ కోట్టాడానికి కంకణం కట్టుకున్నారని ఫిలింవర్గాల సమాచారం. ఇక ఈసినిమాని దాదాపుగా 1000 ధియేటర్ల లోవిడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. ఈసినిమా లో బాలయ్య బాబు రోరింగ్ ఫెర్ ఫామెన్స్ చేశారని అన్నారు. ఈసినిమాకి సంగీతాన్ని మణిశర్మ అందిస్తున్న విషయం అందరికి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu