»   » న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: నంద‌మూరి బాల‌కృష్ణ‌

న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది: నంద‌మూరి బాల‌కృష్ణ‌

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రముఖ తెలుగు నటుడు రంగనాథ్ శనివారం తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఒంటరితనం భరించలేకే రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్నారు. రంగనాథ్ మరణంపై బాలయ్య స్పందించారు. ఆయన మరణం న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంచి న‌టుడు, ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోయామన్నారు.

‘న‌టులు రంగ‌నాథ్‌గారు ఇలా ఆక‌స్మికంగా మ‌ర‌ణించ‌డం అనేది బాధాక‌రం. న‌న్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మంచి న‌టుడు, ఆద‌ర్శ‌వంత‌మైన వ్య‌క్తిని కోల్పోయాం. అలాంటి వ్య‌క్తిని కోల్పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. మూడు వంద‌ల చిత్రాల‌తో పాటు పలు సీరియ‌ల్స్‌లో ఆయ‌న న‌టించి మెప్పించారు. అలాగే ద‌ర్శ‌క‌త్వం కూడా వ‌హించారు. ఆయ‌నతో పాటు క‌లిసి నేను చాలా చిత్రాల్లో న‌టించాను. గొప్ప న‌టుడ్ని తెలుగు చిత్ర‌సీమ‌కు దూర‌మ‌య్యారు. ఆయ‌న మ‌ర‌ణం మ‌న‌కు తీర‌ని లోటు. ఆయ‌న ఆత్మ‌కు భ‌గ‌వంతుడు శాంతిని ప్ర‌సాదించాల‌ని కోరుకుంటూ వారి కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాడ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను. ' అని బాలయ్య వ్యాఖ్యానించారు.

Balakrishna pay tributes to Ranganath

రంగనాథ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు గోడ మీద 'డెస్టినీ' అని రాశారు. తన ఫ్రెండ్ దేవదాసుకు 'గుడ్ బై' అని మెసేజ్ పంపించారు. అలాగే, ఆంధ్రా బ్యాంకులోఉన్న ఫిక్సెడ్ డిపాజిట్స్ మీనాక్షీకి ఇవ్వమని, డోంట్ ట్రబుల్ హర్ అని గోడ మీద రాశారు. మీనాక్షి చాలా కాలంగా రంగనాథ్ ఇంట్లో పని మనిషిగా చేస్తోంది. ఇన్నాళ్లుగా తనకు సహాయంగా ఉన్న ఆమెకు ఏదైనా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతోనే ఆయన ఇలా రాసినట్లు స్పష్టమవుతోంది.

రంగనాథ్ చాలా మంచి మనిషి, అని, తాను అటువంటి మంచి మనిషిని చూడలేదని పని మనిషి మీనాక్షి చెప్పింది. తాను మధ్యాహ్నం 12 గంటలకు రంగనాథ్ కూతురు ఇంటికి వెళ్లానని, తిరిగి వచ్చేసరికి ఇంటి గడియ లోపలి నుంచి పెట్టి ఉందని, తలుపు తీయకపోవడంతో తాను రంగనాథ్ కూతురును, స్థానికులను పిలిచానని ఆమె చెప్పారు.

Balakrishna pay tributes to Ranganath

తలుపులు పగులగొట్టి చూసేసరికి రంగనాథ్ ఉరి వేసుకుని కనిపించారని, ఆస్పత్రికి తరలించామని, అయితే అప్పటికే మరణించారని వైద్యులు చెప్పారని ఆమె అన్నారు. తమ తండ్రి రంగనాథ్ తాను ఆత్మహత్య చేసుకుంటానని అప్పుడప్పుడు అంటుండేవారని ఆయన కూతురు నీరజ చెప్పారు. తాము అందుకు కౌన్సెలింగ్ కూడా ఇప్పించామని ఆమె చెప్పారు.

English summary
Veteran actor Ranganath has died yesterday committing suicide in his residence and his dead body is kept at film chamber for the last glimpses and to pay tribute. Ranganath's son clarified that his father was his real hero and stated that Ranganath wanted to lead a peaceful life hence he was staying alone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu