For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  జై సింహా ఆడియో: చంపడం నీతరం కాదురా. పై వాడి ప్రాబ్లం.. లెక్కంత పైనే.. బాలయ్య

  By Rajababu
  |

  నందమూరి నటసింహం బాలకృష్ణ, ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ కాంబినేషన్‌లో రానున్న జై సింహ చిత్రం సంక్రాంతికి సిద్ధమవుతున్నది. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం విజయవాడలో అభిమానుల మధ్య ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని థియేట్రికల్ ట్రైలర్‌ను శాసన సభ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ద ప్రసాద్ రిలీజ్ చేశారు. ఆడియో వేడుకలో బాలకృష్ణ మాట్లాడుతూ..

  నాన్నగారు.. జయసింహ పేరుతో

  నాన్నగారు.. జయసింహ పేరుతో

  నాన్నగారు తీసిన జయసింహ పేరుతో సినిమా చేశారు. నాన్నగారి స్పూర్తి ఇప్పుడు జై సింహ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని రకాల అంశాలు ఉంటాయి

  అద్భుతమైన సాహిత్యం

  అద్భుతమైన సాహిత్యం

  చిరంతన్ భట్ జై సింహ చిత్రానికి మంచి సంగీతం అందించారు. భాస్కర భట్ల నాకు మరోసారి అద్భుతమైన సాహిత్యాన్ని సమకూర్చారు అని బాలయ్య అన్నారు.

  నారా లోకేష్ నాకు అల్లుడు కావడం

  నారా లోకేష్ నాకు అల్లుడు కావడం

  తొలిసారి మంత్రిగా నా పాటల వేడుకకు నారా లోకేష్ ఇక్కడకు వచ్చాడు. యువకుడు, నేటి రాజకీయాలపై మంచి అవగాహన ఉంది. ఇంతమంచి అల్లుడు దొరకడం నాకు గర్వంగా ఉంది. నాన్న దారిలో నడుస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి లోకేష్ కూడా కష్టపడుతున్నాడు.

  కేఎస్‌కు నేను ఫ్యాన్‌ను

  కేఎస్‌కు నేను ఫ్యాన్‌ను

  నేను దర్శకుడు కేఎస్ రవికుమార్‌కు మంచి ఫ్యాన్‌ను. ఎనిమిదేళ్ల నుంచి ఆయనతో పనిచేయాలని అనుకొంటున్నాను. చివరకు అమ్మవారి దయ, పానకాల నరసింహస్వామి దయవల్ల ఆయనతో పనిచేసే అవకాశం కలిగింది.

  ఇండస్ట్రీ అభివృద్దికి

  ఇండస్ట్రీ అభివృద్దికి

  రాజధాని నిర్మాణంలో తలమునకలై ఉన్న సీఎం చంద్రబాబు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. పరిశ్రమ అభివృద్ధికి చక్కటి ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారు.

  10న రిలీజ్

  10న రిలీజ్

  జనవరి 10న జై సింహ చిత్రం రిలీజ్ కాబోతున్నది. కనకదుర్గమ్మ ఆశీస్సులతో ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుంది. ఈ ఆడియో ఆవిష్కరణను విజయం చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.

  చివర్లో పవర్‌పుల్ డైలాగ్స్

  చివర్లో పవర్‌పుల్ డైలాగ్స్

  చివరగా బాలయ్య మాట్లాడుతూ.. నన్ను చంపడం నీ తరం కాదురా.. అది పై వాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని చంపాలో లెక్క అక్కడ ఉంటుంది. నీ కొడుకు నుదుటి మీద పదవి రాత లేదు. పెళ్లి గీత లేదు. ఆయుష్షులు రేఖ లేదు. అక్కడ డిజైన్ చేసిన ఫిగర్.. నీ పొగరుతో రాత మారదు బే ఇలాంటి ఏన్నో డైలాగ్స్ మిమ్మల్ని అలరిస్తాయి అని అన్నారు.

  నీకు కొట్టడం మాత్రమే తెలుసు

  నీకు కొట్టడం మాత్రమే తెలుసు

  నీకు కొట్టడం మాత్రమే తెలుసు. నాకు పడటం తెలుసు. లేవడం తెలుసు. లేపడం తెలుసు. లేపేయడం తెలుసు. నీ తొక్కలో రౌడీయిజం అంటూ పవర్ డైలాగ్‌ను వేదికపై బాలకృష్ణ కొట్టి అభిమానులను పిచ్చెక్కించారు.

  English summary
  Nandamuri Balakrishna’s forthcoming 102nd movie Jai Simha official trailer is out now and the movie will be released for Pongal, 2018. Nayanthara and Hari Priya playing the female lead roles opposite Balayya in this action entertainer. This movie audio release function organised in Vijayawada. In this event Balakrishna given powerful speech.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more