For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  DHAMKI: స్టేజ్‌పై బాలయ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్.. కార్‌లో అలాంటివి చేయకు.. F అంటూ షాకింగ్‌గా!

  |

  టాలీవుడ్‌లో దాదాపు నలభై ఏళ్లుగా హవాను చూపిస్తూ టాప్ హీరోగా వెలుగొందుతోన్నారు నటసింహా నందమూరి బాలకృష్ణ. బ్యాగ్రౌండ్‌తో సినిమాల్లోకి వచ్చినా.. తనదైన టాలెంట్‌తో తిరుగులేని శక్తిగా ఎదిగారు. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో రెట్టించిన ఉత్సాహంతో కనిపిస్తున్నారు. అలాగే, యంగ్ హీరోల సినిమాలను సైతం ఆయన ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే విశ్వక్ సేన్ నటించిన 'ధమ్కీ' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలయ్య కొన్ని డబుల్ మీనింగ్ డైలాగులు వదిలారు. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

  ధమ్కీ ఇచ్చేందుకు వస్తోన్న విశ్వక్

  ధమ్కీ ఇచ్చేందుకు వస్తోన్న విశ్వక్

  మాస్ కా దాస్ విశ్వక్ సేన్ హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన సినిమానే 'ధమ్కీ'. ఇందులో నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటించింది. వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మించిన ఈ సినిమాకు లియాన్ జేమ్స్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఇందులో రావు రమేష్, తరుణ్ భాస్కర్ తదితరులు కీలక పాత్రలు చేశారు.

  యాంకర్ వర్షిణి హాట్ సెల్ఫీ వైరల్: ఆ పార్ట్‌ను హైలైట్ చేస్తూ అరాచకం

  ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

  ఘనంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్

  టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో రాబోతున్న 'ధమ్కీ' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌ ఆడిటోరియంలో నిర్వహించారు. దీనికి నటసింహా నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఆయన ఈ సినిమా ట్రైలర్ 1.0ను విడుదల చేశారు. ఈ వేడుక ఎంతో గ్రాండ్‌గా జరిగింది.

  బాలయ్య మాస్ స్పీచ్.. మేనరిజం

  బాలయ్య మాస్ స్పీచ్.. మేనరిజం

  విశ్వక్ సేన్ నటించిన 'ధమ్కీ' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా విచ్చేసిన నటసింహా నందమూరి బాలకృష్ణ మేనరిజం, స్పీచ్ ఆకట్టుకున్నారు. అంతేకాదు, హోస్ట్ మైక్ అందించగానే బాలయ్య దాన్ని గాల్లోకి విసిరేసి క్యాచ్ పట్టుకున్నారు. ఆ తర్వాత అదే ఉత్సాహాన్ని చూపిస్తూ మాట్లాడారు. అలాగే, సరస్వతీ దేవి శ్లోకం చెప్పి మరీ స్పీను మొదలు పెట్టారు.

  Jaya Krishna: కృష్ణ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. మహేశ్ ఫ్యామిలీ నుంచి హీరో.. ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో!

  అరే బయ్.. నీ ఇంట్లో నా ఇంజిను

  అరే బయ్.. నీ ఇంట్లో నా ఇంజిను

  విశ్వక్ సేన్ నటించి, తెరకెక్కించిన 'ధమ్కీ' మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో బాలయ్య మాట్లాడుతూ.. 'అరే బయ్.. మొత్తం నువ్వే మాట్లాడేసినవ్ కదా.. నేనేం మాట్లాడను' అంటూ విశ్వక్ సేన్‌కు పంచ్ ఇచ్చారు. ఆ తర్వాత స్పీచ్ కంటిన్యూ చేస్తూ ట్రైలర్‌లోని 'నీ ఇంట్లో నా ఇంజిను' అనే డైలాగ్‌ను చెప్పారు. దీంతో ఆడిటోరియం అంతా అరుపులతో రీసౌండ్ వచ్చేసింది.

  మైక్‌ పని చేయదేమో అనుకున్నా

  మైక్‌ పని చేయదేమో అనుకున్నా

  బాలయ్య మాట్లాడుతూ.. 'తమ్మి విశ్వక్ సేన్ వాళ్ల నాన్న మాట్లాడినప్పుడు ఆయన ఎత్తుకోవడమే ధమ్కీ లాగ ఎత్తిండు. తర్వాత మైకులు పనిచేయవేమో, నేను మాట్లాడలేనేమో అనుకున్నా. ఆయనకు విశ్వక్‌ సినిమా హీరో అవుతాడని ముందే తెలుసేమో. నాలాగే ఏమైనా ఉంగరాలు పెట్టుకున్నాడా ఏంటి' అంటూ ఫన్నీగా మాట్లాడుతూ ఉంగరాల గురించి ఓ స్టోరీ చెప్పుకొచ్చారు.

  ఏకంగా షర్ట్ విప్పేసిన యాంకర్ స్రవంతి: ఎద అందాలు ఆరబోస్తూ ఘోరంగా!

  విశ్వక్‌ గురించి చెప్పిన బాలయ్య

  విశ్వక్‌ గురించి చెప్పిన బాలయ్య

  ఈ ఫంక్షన్‌లో బాలయ్య 'సినిమా అంటే విశ్వక్‌కు చాలా ప్యాషన్. ఈ సినిమా చూస్తే అది తెలుస్తుంది. ఎన్నో ఒడిదుడుకులు దాటి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఎప్పుడూ ఆదరిస్తారు. ఫలక్‌నుమా దాస్, అశోకవనంలో అర్జున కళ్యాణం, ఓరి దేవుడా ఇలా వైవిధ్యమైన సినిమాలతో అలరించి ఇప్పుడు 'ధమ్కీ'తో వస్తున్నాడు' అన్నారు.

  విశ్వక్‌పై బాలయ్య ప్రశంసల జల్లు

  విశ్వక్‌పై బాలయ్య ప్రశంసల జల్లు

  బాలయ్య కొనసాగిస్తూ.. 'ఈ సినిమాకు నటనతో పాటు దర్శకత్వం, నిర్మాణం చేయడం కూడా చాలా అరుదైన విషయం. విశ్వక్ సేన్ అన్నీ తానై, తన టీంకి స్ఫూర్తిని ఇచ్చాడు. ఇలాంటి సినిమాలు చూస్తున్నపుడు నన్ను నేను ఊహించుకుంటాను. ఇలాంటివి నేను చూస్తే మీరు చూడరు కదా. 'ధమ్కీ' థియేటర్‌లో చూడాల్సిన సినిమా. దర్శకుడిగా అద్భుతంగా తీశాడు విశ్వక్. టీం అందరికీ నా అభినందనలు. అందరూ థియేటర్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేయాలి. సక్సెస్ మీట్‌కు కూడా నేనే రావాలి' అని చెప్పారు.

  రష్మీ గౌతమ్‌కు విల్లాను గిఫ్టుగా ఇచ్చిన హీరో: అతడి గురించి పెదవి విప్పబోతున్న యాంకర్

  బాలయ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్

  బాలయ్య డబుల్ మీనింగ్ డైలాగ్స్

  విశ్వక్ సేన్ 'ధమ్కీ' ట్రైలర్ ఈవెంట్‌లో బాలయ్య నోట వచ్చిన డబుల్ మీనింగ్ డైలాగులు అరుపులు పుట్టించాయి. ముందుగా ఆయన 'కొన్ని కార్లలో లేవు. పెట్టుకోము. గెట్ అవుట్ ఆఫ్ మై కార్ అందిగా.. జాగ్రత్తమ్మా' అంటూ ట్రైలర్‌లోని డైలాగ్‌ను గుర్తు చేశారు. అంతేకాదు, ఈ కార్యక్రమంలో F పదాలను కూడా వాడారు. దీంతో అక్కడున్న వాళ్లంతా ఉర్రూతలూగిపోయారు.

  English summary
  Nandamuri Balakrishna Recently Participated in DHAMKI Movie Trailer Launch Event. He Praises on Vishwak Sen at This Event.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X